హైదరాబాద్: సియాచిన్ ప్రాంతంలో 35 అడుగుల మంచుకింద 6 రోజులపాటు కూరుకుపోయి బయటపడ్డ సైనికుడు హనుమంతప్ప ఇప్పుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతను కోమాలో ఉన్నాడని, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. లో బ్లడ్ ప్రెషర్‌తో పాటు లివర్, కిడ్నీలలో సమస్యలు ఏర్పడినట్లు తెలిపారు. అయితే ఫ్రాస్ట్ బైట్, ఎముకలు విరగటం వంటివి లేకపోవటం అదృష్టమేనని అన్నారు. బ్లడ్ ప్రెషర్ పెంచటంకోసం ఫ్లూయిడ్స్, డ్రగ్స్ ఇస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం వెంటిలేటర్ అమర్చినట్లు తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడి హనుమంతప్పను అభినందించారు. మోడి నిన్న ఆర్మీ ఆసుపత్రిని సందర్శించి హనుమంతప్ప ఆరోగ్య పరిస్థితిని కనుక్కున్నారు. ఇవాళ ఉదయం ఆర్మీ ఛీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ మరోసారి ఆర్మీ ఆసుపత్రికి వెళ్ళి హనుమంతప్పకు జరుగుతున్న చికిత్సను పరిశీలించారు. మరోవైపు సియాచిన్ హిమపాతంలో జాడలేకుండా పోయిన మిగిలిన తొమ్మిదిమందిలో కర్నూలు జిల్లాకు చెందిన ముస్తాక్ అనే సైనికుడు కూడా ఉన్నట్లు ఇవాళ బయటపడింది.
https://www.youtube.com/watch?v=qyiNxf5kpN8