స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ .. కేంద్రానికి రాసిన లేఖ విషయలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు టోన్ మార్చారు. నిన్న సాయంత్రం నుంచి అదో ఫేక్ లేఖ అని.. టీడీపీ సృష్టి అని ఆరోపిస్తున్న వారు ఇవాళ.. అసలు ఆ లేఖ బయటకు ఎలా వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఎస్ఈసీ రమేష్ కుమార్ కేంద్రానికి రాసిన లేఖ తర్వాత అనూహ్యంగా పరిస్థితులు మారిపోయాయి. సీఆర్పీఎఫ్ భద్రతను.. ఎస్ఈసీకి..కార్యాలయానికి కల్పించారు. కేంద్ర హోంశాఖ కూడా.. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా ఈ లేఖ రాశారంటూ.. వైసీపీ నేతలు మండిపడ్డారు. అయితే.. లేఖ నిజం కావడంతో.. బయటకు ఎలా వచ్చిందో విచారణ చేయాలంటూ..కొత్త డిమాండ్లు అందుకున్నారు.
కొంత మంది వైసీపీ ఎమ్మెల్యేల బృందం…డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ను కలిసింది. ఎస్ఈసీ రమేష్‌కుమార్ లేఖ ఎలా బయటకు వచ్చిందో దర్యాప్తు చేయాలని కోరారు. నిజానికి లేఖ నిజమా.. కాదా అన్నదే ముఖ్యం కానీ.. అది బయటకు ఎలా వచ్చిందో అన్నది పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఆ లేఖ బయటకు రావడమే వైసీపీ నేతలకు ఇబ్బందికరంగా మారింది. అందుకే… ఎస్ఈసీ రమేష్ కుమార్ పై ఒత్తిడి తెచ్చేందుకు ఆ లేఖ ఎలా బయటకు వచ్చిందో దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. నిజానికిఈ లేఖ విషయంలో.. రమేష్ కుమార్ గుంభనంగా వ్యవహరిస్తున్నారు.
లేఖ రాసినట్లుగా కానీ.. రాయనట్లుగా కానీ ఆయన స్పందించడం లేదు. మీడియాకు ఎలా వచ్చిందో తనకు తెలియదన్నట్లుగా ఆయన ఉండిపోయారు. ఆ లేఖను తాను రాయలేదని కొంత మంది మీడియా ప్రతినిధులుక ఆయన చెప్పినట్లుగా.. వైసీపీకి మద్దతుగా ఉండే కొన్ని చానళ్లు నిన్నంతా ప్రచారం చేశాయి. కానీ .. ఆయన అలాంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన కేంద్ర బలగాల భద్రత కల్పించడం… వైసీపీ నేతలు.. ఆ లేఖ వాస్తవికత గురించి కాకుండా.. ఎలా బయటకు వచ్చిందో దర్యాప్తు చేయాలని డీజీపీని కోరడం… వంటివి పరిశీలిస్తే.. ఆ లేఖ పై.. ఇక రమేష్ కుమార్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం ఏర్పరుచుకోవచ్చంటున్నారు.