లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలందరూ కరోనా భయంతో వణికిపోతున్నారు. దీనికి కారణం.. బాలీవుడ్ సింగర్ కనికా కపూర్. కనికా కపూర్‌కు కరోనా పాజిటి్వ్ అని తేలింది. కొద్ది రోజుల క్రితం లండన్ వెళ్లిన ఆమె అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్‌లో పాల్గొని ఇండియాకు వచ్చింది. అయితే.. తాను లండన్ వెళ్లినట్లుగా.. అక్కడ బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లుగా ఎవరికీ చెప్పలేదు. ఆమె రోజువారీ పనులను చేసుకుంటున్నారు. ఈ క్రమంలో.. ఆమె లక్నోలో… ఓ లావిష్ పార్టీకి అటెండ్ అయ్యారు. ఇది హైప్రోఫైల్ పార్టీ. దీనికి రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరాజే… ఆమె తనయుడు దుష్యంత్ తో పాటు.. అఖిలేష్ యాదవ్ సహా.. చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు.
ఆ కార్యక్రమం ముగిసిపోయింది. ఆ తర్వాత అందరూ ఎవరి దారిన వాళ్లు వెళ్లారు. తర్వాత ఎంపీ దుష్యంత్ సింగ్ పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. ఎంపీలందరితోనూ రాసుకుని పూసుకుని తిరిగారు. ఇప్పుడు కనికా కపూర్‌కి కరోనా పాజిటివ్ అని తేలింది. వెంటనే తాము హోమ్ క్వారంటైన్ లోకి వెళ్తున్నట్లుగా.. వసుంధరాజే, దుష్యంత్ సింగ్ ప్రకటించారు. కానీ దుష్యంత్ సింగ్ కు కూడా.. కరోనా పాజిటివ్ అని తేలిందన్న ప్రచారం ఊపందుకుంది. అయితే.. ఇందులో నిజం లేదని చెబుతున్నారు. దీంతో.. రాజ్యసభ, లోక్ సభ ఎంపీలు హడలి పోతున్నారు. ఆ పార్టీకి వెళ్లి వచ్చిన తర్వాత దుష్యంత్ సింగ్.. రాష్ట్రపతి భవన్ ను కూడా సందర్శించారు. దీంతో… పార్లమెంట్ లో దుష్యంత్ సింగ్ కు సమీపంలో కూర్చున్న వారంతా క్వారంటైన్ కు వెళ్లాలన్న సూచనలు వినిపిస్తున్నాయి.
తృణమూల్ ఎంపీ డెరక్ ఓబ్రెయిన్ ఇప్పటికే.. ఆ సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్తున్నట్లుగా ప్రకంటించారు. తక్షణం పార్లమెంట్ సమావేశాలను నిలిపివేయాలని శివసేన డిమాండ్ చేసింది. మొత్తానికి ఇప్పుడు.. పార్లమెంట్ సభ్యులందరికీ.. దుష్యంత్ సింగ్ భయం పట్టుకుంది. ఆయనకు కానీ కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయితే.. ఇక పార్లమెంట్ ఆపేసి..ఎంపీలు అందరూ ఐసోలేషన్ వార్డులో చేరిపోయినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది.