కరోనాని కంట్రోల్ చేయడానికి జనతా కర్ఫ్యూని విజయవాడలో కొనసాగించబోతున్నారు. తొలి సారిగా విజయవాడలో కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. దీంతో ఉలిక్కిపడిన ప్రభుత్వం.. జనతా కర్ఫ్యూను మరో మూడు రోజుల పాటు పొడిగించాలని నిర్ణయించుకుంది. అలాగే.. ఏప్రిల్ 14వరకు 144 సెక్షన్ అమలు చేయాలన ినిర్ణయించారు. ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. జనతా కర్ఫ్యూ సందర్బగా విజయవాడ మొత్తం నిర్మానుష్యంగా మారింది. ప్రజలెవరూ రోడ్ల మీదకు రాలేదు.
విదేశాల నుంచి వచ్చిన వారిని .. పట్టుకోవడం.. ఏపీ అధికారయంత్రాంగానికి పెద్ద సమస్యగా మారింది. అలాంటి వారి ఆచూకీ తెలుసుకుని..వారిలో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే.. తక్షణం.. ఐసోలేషన్ కేంద్రాలకు తరలించడంతో సమస్య పరిష్కారం కావడంలేదు. ఇప్పటికే వారు.. కుటుంబంతోనూ ఇతరులతోనూ సన్నిహితంగా మెలిగి ఉంటారు. దాంతో.. వారందర్నీ కూడా.. క్వారంటైన్ సెంటర్లకు తరలించాల్సి వస్తోంది. ప్రస్తుతం విజయవాడలో ఓ రకమైన భయానక పరిస్థితి ఏర్పడింది.
చాలా వరకూ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు వర్క్ ఫ్రం హోం ఇవ్వడమో.. సెలవులు ప్రకటించడమో చేశాయి. ఓ మాదిరి ఉద్యోగులకు ఇబ్బంది లేకపోయినా… రోజు కలీలు.., చిరు వ్యాపారులు… తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారి కోసం.. నిత్యావసర వస్తువులు అయినా పంపిణీ చేయాలన్న అభిప్రాయం అన్ని వైపుల నుంచి వినిపిస్తోంది. ప్రభుత్వం ఈ దిశగా ఏమైనా ఆలోచన చేస్తుందో లేదో మాత్రం.. ఎవరికీ తెలియడం లేదు. కర్ఫ్యూను మరికొంత కాలం పొడిగిస్తే… అన్ని వర్గాల ప్రజలు.. నిత్యావసరాల కోసం ఇబ్బందిపడే పరిస్థితులు ఉంటాయి.