తెలుగు రాష్ట్రాలు లాక్ డౌన్ అయిపోయాయి. అత్యవసర సేవలు మినహా.. మరేమీ అందవు. అంత వరకూ బాగానే ఉన్నా.. అసలు ఈ లాక్ డౌన్ వల్ల నష్టపోయే ప్రజలకు.. తిండి. తిప్పల కోసం ఇబ్బందిపడేవారికి.. ప్రభుత్వం చేసే సాయాలు సరిపోతాయా.. అన్నదే కీలకం. ప్రభుత్వాలు ఇక్కడే చిత్తశుద్ధితో.. సీరియస్‌గా వ్యవహరించాల్స ఉంది. తెలంగాణ సీఎం కేసీఆర్… ఓ నెల రేషన్ బియ్యంతో పాటు.. తెల్ల రేషన్ కార్డులదారులందరికీ.. రూ. పదిహేను వందలను ఇతర సరుకలనుకొనుగోలు చేసేందుకు ఇస్తామని ప్రకటించారు. ఏపీ సీఎం జగన్.. అందరికీ ఉచితంగా రేషన్ బియ్యంతో పాటు కిలో కిందిపప్పు.. మరో రూ. వెయ్యి ఆర్థిక సాయాన్ని అందిస్తామని ప్రకటించారు. వచ్చే నెల నాలుగో తేదీన ఆ మొత్తాన్ని ఇస్తామన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు .. చిరు వ్యాపారాలు.. రోజు కూలీ పనులు.. అన్నీ ఆగిపోనున్నాయి. రెండు రాష్ట్రాల సరిహద్దులు మూసేస్తున్నారు. రైళ్లు, బస్సులు మాత్రమే కాదు.. క్యాబ్‌లు.. ఆటోలు కూడా తిరగడానికి అవకాశం లేకుండా పోయింది. కేవలం.. నిత్యావసర వస్తువుల సరకుల రవాణాను మాత్రమే అనుమతిస్తారు. బియ్యం, పాలు, కూరగాయాలు లాంటి వాటిని సరఫరా చేస్తారు. ప్రజా రవణా మొత్తం నిలిచిపోతుంది. ఇది కొన్ని లక్షల కుటుంబాలకు ఉపాధి లేకుండా చేస్తుంది. ఏపీలో చాలా కాలంగా… దినసరి కూలీలలు పెద్దగా పనులు ఉండటం లేదు. నిర్మాణ రంగం పూర్తిగా కుదేలయిన కారణంగా… అక్కడ పేదలు తన ఆదాయాన్ని కోల్పోయారు. ఇప్పుడు కరోనా కారణంగా.. లాక్ డౌన్ ప్రకటించాల్సిన రావడంతో.. వారి ఉపాధిపై తీవ్రమైన దెబ్బ పడనుంది.
ఓ నెల రేషన్… రూ. వెయ్యో.. పదిహేను వందలో ఇవ్వడం వల్ల.. పేదలకు ఊరట లభిస్తుంది. కానీ.. అది మాత్రమే.. సరిపోదు. నిత్యాసవర వస్తువుల ధరలను కట్టడి చేయాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్ని.. క్యాష్ చేసుకోవడానికి వ్యాపారాలు .. బ్లాక్ మార్కెటిర్లు రెడీగా ఉంటారు. ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. రేషన్ కార్డులు లేని వాళ్లు.. అభాగ్యలు పెద్ద ఎత్తున ఉంటారు. రోడ్ల మీద జనం తిరుగుతూ ఉంటేనే వారికి.. కాస్త తిండి లభిస్తుంది. అలాంటి వారి కోసం ప్రభుత్వాలు ఏమైనా చేయాల్సి ఉంది. కేరళలో… ఉచిత భోజనశాలలు ఏర్పాటు చేశారు. అలాంటివి చేస్తే.. లాక్ డౌన్లో ఆకలి చావులు లేకుండా ఉంటాయి. లేకుండా ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వాలు మరంత సమర్థంగా ఆలోచించి.. నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఉదారంగా సాయం అందించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది.