సాయం చేసే చేతులు మెల్లమెల్లగా పెరుగుతున్నాయి. కరోనాపై పోరాడుతున్న ప్రజలకు, ప్రభుత్వానికి తమ వంతు భరోసాగా స్టార్లు కదిలివస్తున్నారు. పవన్ కల్యాణ్ ఇప్పటికే కోటి రూపాయల సాయం ప్రకటించాడు. నితిన్ 20 లక్షలు ఇచ్చాడు. మిగిలినవాళ్లు తమ దారిలో తమ వంతుగా శ్రమిస్తున్నారు. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ రూ.20 లక్షల వితరణ ప్రకటించాడు. త్రివిక్రమ్ రెండు తెలుగు రాష్ఠ్రాలకు చెరో పది లక్షల చెప్పున ఈ సహాయం అందించనున్నారని హారిక హాసిని సంస్థ ప్రకటించింది. త్వరలోనే ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తారు.