అందరూ.. ఇంటి పట్టునే ఉండే సిట్యూయేషన్ . దీన్ని రాజకీయంగా కొంత మందిని బద్నాం చేయడానికి.. కరోనాపై పానిక్‌ను మరంతగా వ్యాపింపచేయడానికి వాడేసుకుంటున్నారు… కొంత మంది తెలివి మీరిన వాళ్లు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ చెప్పిన విషయాలంటూ.. ఓ ఆడియోను.. వైరల్ చేశారు కొంత మంది. ఇందులో కరోనా అనే వైరస్ గురించి.. భయంకరంగా వీవీ లక్ష్మినారాయణ చెప్పినట్లుగా ఉందంటున్నారు. ఈ ఆడియో వ్యవహారం వీవీ లక్ష్మినారాయణ దృష్టికి వెళ్లడంతో.. వెంటనే స్పందించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫేక్ ఆడియోలు.. సర్క్యూలేట్ చేయడం కరెక్ట్ కాదని ఖండించారు. కరోనా గురించి.. ఎంత జాగ్రత్తగా ఉండాలో కూడా వివరించారు.
వీవీ లక్ష్మినారాయణ పేరుతోనే.. ఆ ఆడియో ఎందుకు బయటకు వచ్చిందో.. ఎవరికీ అర్థం కాలేదు కానీ.. ఆయన ఇమేజ్ ను వ్యక్తిగతంగా డామేజ్ చేసే ప్రయత్నంలో భాగంగానే.. ఇలాంటి పనులు చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కల్యాణ్ సినిమాలలో నటించడం ప్రారంభించిన తర్వాత.. తనకు నచ్చలేదని చెబుతూ.. వీవీ లక్ష్మినారాయణ జనసేనకు రాజీనామా చేశారు. ఆ తర్వాత రాజకీయాల గురించి పట్టించుకోకుండా.. తన స్వచ్చంద సంస్థ ద్వారా.. కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే.. హఠాత్తుగా ఆయన కరోనాపై వివాదాస్పదంగా మాట్లాడారంటూ.. ఆయనపై వివాదం సృష్టించే ప్రయత్నం జరిగింది.
వీవీ లక్ష్మినారాయణ.. వివాదాస్పదంగా మాట్లాడే వ్యక్తి కాదు. వ్యక్తిగతంగానూ.. రాజకీయంగానూ ఆయన హద్దులు ఎప్పుడూ దాటలేదు. దాంతో.. ఆ ఆడియో ఫేక్ అని చాలా మందికి అర్థం అయిపోయింది. అయితే.. కామ్‌గా ఉంటే.. తనదే అనుకుంటారన్న ఉద్దేశంతో.. వీవీ లక్ష్మినారాయణ వివరణ ప్రకటన చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి కరోనా టైంలోనూ… ఉత్సాహం ఎక్కువైన రాజకీయ పార్టీల కార్యకర్తలు చాలా బిజీగా ఉంటున్నారని.. వీవీ లక్ష్మినారాయణ ఫేక్ ఆడియో ద్వారా తేలిపోతుందంటున్నారు.