ఏప్రిల్ 16న జరగాల్సిన నితిన్ పెళ్లి వాయిదా పడింది. ఈ విషయాన్ని నితిన్ స్వయంగా తెలిపాడు. మార్చి 30 నితిన్ పుట్టిన రోజు. కరోనా కారణంగా పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని నితిన్ తెలిపాడు. .
”అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ బయటకు రాకూడని లాక్డౌన్ కాలంలో మార్చి 30వ తేదీ నా పుట్టినరోజును జరుపుకోకూడదని నిర్ణయించుకున్నాను. అందువల్ల ఎక్కడా కూడా నా పుట్టినరోజు వేడుకలు జరుపవద్దని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. అంతే కాదు, లాక్డౌన్ నేపథ్యంలో ఏప్రిల్ 16వ తేదీ జరగాల్సిన నా పెళ్లిని కూడా వాయిదా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనమందరం కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కలిసికట్టుగా పోరాటం చేయాలి” అని చెప్పుకొచ్చాడు నితిన్.