ఏప్రిల్ 14 వరకూ కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ కి ప్రకటించిన సంగతి విదితమే. అయితే కరోనా మహమ్మారి మరింతగా ప్రబలతున్న నేపథ్యంలో ఈ లాక్ డౌన్ ని పొడిగిస్తారని, అవసరమైతే జూన్ 1 వరకూ కొనసాగిస్తారని ప్రచారం జరుగుతోంది. జరుగుతున్న పరిణామాలూ, కరోనా బాధితుల సంఖ్య పెరగడం, కరోనా పై మిగిలిన దేశాలు అవలంభిస్తున్న వైఖరి చూస్తే.. అది నిజమేనేమో అనిపిస్తోంది. దానికి తోడు ఇ.ఎం.ఐ లు మూడు నెలల పాటు లేవని బ్యాంకులు ప్రకటించడం చూస్తుంటే… మరో రెండు నెలల పాటు ఈ లాక్ డౌన్ తప్పదని అందరూ ఓ అంచనాకు వచ్చేశారు.
ఈ నేపథ్యంలో ఓ శుభవార్త వచ్చింది. లాక్ డౌన్ ని పొడిగిస్తున్నామన్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని, ఇవన్నీ నిరాధారమైన వార్తలని కేంద్రం కొట్టిపారేసింది. ఏప్రిల్ 14 వరకే లాక్ డౌన్ అని, దీన్ని పెంచే విషయం ఇప్పటి వరకూ చర్చకే రాలేదని కేంద్ర కాబినేట్ ప్రధాన కార్యదర్సి రాజీవ్ గౌబా తెలిపారు. నిజంగా ఇది శుభవార్తే. కాకపోతే… లాక్ డౌన్ ని పెంచే ప్రతిపాదన కేంద్రం యోచిస్తోందని,. అయితే ఇది ఇప్పుడే ప్రకటిస్తే ప్రజలు భయకంపితులు అవుతారని, ఏప్రిల్ 14నే పొడిగింపు విషయాన్ని ప్రకటిస్తారని మరోవైపు కొత్త విశ్లేషణలు పుట్టుకొస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.