ఆంధ్రులు ఎక్కడ కష్టాల్లో ఉన్నారని తెలిసినా.. వారిని ఆదుకునేందుకు తన వంతు ప్రయత్నం పవన్ కల్యాణ్ చేస్తూంటారు. ఇలా ఆయన చేసిన ప్రయత్నం తమిళనాడు తీరంలో ఇరుక్కుపోయిన ఉత్తరాంధ్ర మత్స్యకారుల కడుపు నింపుతోంది. నేరుగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనీ స్వామినే.. పవన్ కల్యాణ్ విజ్ఞప్తిపై స్పందించి.. వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం సీహెచ్ చొలగండి గ్రామానికి చెందిన సుమారు 30 మంది మత్స్యకారులు చేపల వేట కోసం తమిళనాడు తీరానికి వెళ్లారు. అయితే లాక్డౌన్ కారణంగా చెన్నై హార్బర్ దగ్గర వారంతా చిక్కుకుపోయారు. కనీస అవసరాలు తీరేందుకు అవసరమైన సొమ్ము కూడా లేకపోవడంతో.. ఆకలితో అలమటిస్తున్నారు.
ఈ విషయం జనసేన పార్టీ నేతల ద్వారా తెలుసుకున్న పవన్ కల్యాణ్ వెంటనే.. వారిని ఆదుకోవాలని.. తమిళనాడు ముఖ్యమంత్రి ఈకే పళనిస్వామిని ట్విట్టర్ ద్వారా కోరారు. పవన్ కల్యాణ్ ఈ ట్వీట్‌ను పూర్తిగా తమిళంలో చేశారు. పవన్ కల్యాణ్ తమిళ ట్వీట్ పై పళని స్వామి వెంటనే స్పందించారు. వారిని ఆదుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు అధికారులు ఉత్తారంధ్ర జాలర్లకు నిత్యావసరాల సరుకులు అందించినట్లుగా తెలుస్తోంది.
పవన్ కల్యాణ్.. ఈ తమిళం ట్వీట్‌ను.. పళని స్వామికి చేశారు… అలాగే.. మరో ట్వీట్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లారు. అయితే.. ఏపీ సీఎంవో అధికారులకు పవన్ కల్యాణ్ ట్వీట్ విషయాన్ని పట్టించుకునే తీరిక లేకపోయింది. ఇతర రాష్ట్రాల్లో ఇరుక్కుపోయిన అనేక వేల మంది ఏపీ వాసుల విషయంలో ఏపీ సర్కార్.. పట్టనట్లుగా ఉంటోందన్న విమర్శలు వస్తున్న తరుణంలో.. ఇతర రాష్ట్ర సీఎంతో మాట్లాడి.. పవన్ కల్యాణ్.. ఆదుకోవడం… హాట్ టాపిక్‌గా మారింది.
Dear @PawanKalyan ,
I have informed the concerned Department to act on it immediately. We will take care of them. Thank you! https://t.co/kL1dAiSySD— CMOTamilNadu (@CMOTamilnadu) March 30, 2020
A humble request to Tamilnadu Govt..?@CMOTamilNadu@srikakulamgoap@AndhraPradeshCM pic.twitter.com/UYurg9A35h
— Pawan Kalyan (@PawanKalyan) March 29, 2020