మహేష్ బాబు – పరశురామ్ కాంబినేషన్ లో ఓ సినిమా సెట్టయ్యింది. మైత్రీ మూవీస్, 14 రీల్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జూన్ లేదా జులైలో ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్సుంది. ఈ చిత్రంలో కథానాయికగా చాలా మంది పేర్లు బయటకు వచ్చాయి. కీర్తి సురేష్, జాన్వీకపూర్, రష్మిక.. ఇలా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీఖాన్ పేరు కూడా చేరింది. మహేష్ పక్కన బాలీవుడ్ భామనే రంగ ప్రవేశం చేయిస్తారని, సారా మహేష్‌కి సరిజోడీ అని కొన్ని వెబ్ సైట్లు, పత్రికలు కథనాలు అల్లేస్తున్నాయి. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ ఇంకా ఫిక్స్ కాలేదట. ప్రస్తుతం పరశురామ్ డైలాగ్ వెర్షన్‌తో బిజీగా ఉన్నారని, అది పూర్తయ్యాక మహేష్‌కి ఫైనల్ నేరేషన్ ఇస్తారని, ఆ తరవాతే హీరోయిన్ విషయాన్ని ఆలోచిస్తారని చిత్రబృందంలో కీలక సభ్యుడొకరు తెలిపారు. మహేష్ కూడా ఇప్పుడు పరశురామ్‌ని గానీ, చిత్రబృందాన్ని గానీ ఏమాత్రం తొందరపెట్టడం లేదట. ఎలాగూ లాక్ డౌన్ అమలులో ఉంది కాబట్టి, పనులన్నీ మెల్లగా చేయమని, వీలైనంత సమయం తీసుకోమని చెబుతున్నాడట. అవును.. మహేష్ దృష్టంతా ఇప్పుడు కుటుంబంతో గడపడంపైనే ఉంది. అందుకే సినిమాల గురించి పెద్దగా ఆలోచించడం లేదు.