గోపీచంద్ – సంపత్ నంది కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. దీనికి `సిటీమార్` అనే పేరు ఫిక్స్ చేశారు. తమన్నా కథానాయిక. కబడ్డీ నేపథ్యంలో సాగే చిత్రమిది. గోపీచంద్, తమన్నా ఇద్దరూ కబడ్డీ కోచ్‌లుగా కనిపించబోతున్నారు. క్రీడా నేపథ్యమే అయినా.. మంచి మాస్ మసాలా అంశాలన్నీ జోడించే ప్రయత్నం చేస్తున్నాడు సంపత్ నంది. తన సినిమాల్లో పాటలు బాగుంటాయి. వాటిని తెరకెక్కించే తీరూ బాగుంటుంది. ఈసారీ సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తోంది. అలవాటు ప్రకారం ఓ మాంచి ఐటెమ్ గీతాన్నీ జోడించార్ట. ఈ పాటలో బాలీవుడ్ భామ ఊర్వశీ రౌటేలా కనిపించబోతోంది. `గ్రాండ్ మస్తీ`, `కాబిల్` లాంటి చిత్రాల్లో మెరిసింది ఊర్వశీ. మాంచి హాట్ గాళ్‌గా పేరు తెచ్చుకుంది. తనకు ఇదే తొలి సౌత్ ఇండియన్ చిత్రం కాబోతోంది. దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తయ్యింది. లాక్ డౌన్ ఎత్తేసిన తరవాత.. పాటల్ని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తోంది చిత్రబృందం.