తెలంగాణ సీఎం కేసీఆర్ పోలీసులు, వైద్య, ఆరోగ్య , పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తి జీతాలు ఇవ్వాలని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో పోలీసులు, వైద్య ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బంది కష్టపడి పని చేస్తున్నారని వారందరికీ పూర్తి జీతాలివ్వాలని… శనివారం ఉదయం నిర్వహించిన సమీక్షలో అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల జీతాల విషయంలో.. ఏపీ సీఎం.. పూర్తి స్థాయిలో తెలంగాణ సీఎం కేసీఆర్ను ఫాలో అవుతున్నారు. తెలంగాణ సీఎం ఉద్యోగుల జీతాలను… సగానికి మేర కోత విధించాలని నిర్ణయించినట్లుగా ప్రకటించిన వెంటనే.. ఏపీలోనూ అదే నిర్ణయం తీసుకున్నారు. నిజానికి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నది మార్చి 30వ తేదీన. అప్పటికే ఏపీలో శాలరీ బిల్లుల ప్రాసెస్ పూర్తయిపోయింది.
అయినా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నందున … తాము కూడా అలాగే తీసుకోవాలన్నట్లుగా.. ఆ బిల్లులన్నింటినీ నిలుపుదల చేసి.. ఉద్యోగులకు సగం జీతాలు కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ బిల్లుల ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో.. ఉద్యోగులకు జీతాలు అందలేదు. అయితే.. ఈ లోపు కేసీఆర్ కు.. వైద్య, ఆరోగ్య, పోలీసు శాఖల నుంచి అనేక విజ్ఞప్తులు వచ్చాయి. ప్రస్తుత సంక్షోభ సమయంలో… ఎక్కువగా కష్టపడుతోంది… వైద్య, ఆరోగ్య, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందేనని.. వారికి జీతాల కోత విధించడం సరి కాదన్న వినతులు వెళ్లాయి.
దీన్ని పరిశీలించిన కేసీఆర్… వారందరికీ పూర్తి స్థాయి జీతాలు చెల్లించడంతో పాటు ఇన్సెంటివ్ చెల్లించాలని నిర్ణయించారు. ఇన్సెంటివ్స్ గురించి ఇప్పుడు చెప్పనప్పటికీ… పూర్తి జీతాలు చెల్లించాలని.. శుక్రవారం ఆదే్శాలు జారీ చేశారు. ఏపీలో శనివారం ముఖ్యమంత్రి సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మిగతాఅన్ని విభాగాలు.. పెన్షనర్లకు జీతాల కోత అమలవుతుంది. ఇన్సెంటివ్స్పై తెలంగాణ సీఎం కేసీఆర్ .. నిర్ణయం తీసుకున్న తర్వాత ఏపీ సీఎం కూడా.. దానిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.