ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు మూడు వేలు దాటిపోయాయి. గత నాలుగైదు రోజుల్ని ఉద్ధృతంగా నమోదవుతున్నాయి. ఈ పరిస్థితి చూస్తే… భారత్‌లో వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందని అనిపిస్తుంది. కానీ.. కొన్ని రకాల విశ్లేషణలు చూస్తే.. కరోనాను..భారత్ కట్టడి చేసిందన్న అభిప్రాయం కలుగుతుంది. అదేమిటంటే.. గత నాలుగైదు రోజుల్ని.. బయట పడుతున్న కేసుల్లో 90 శాతానికిపైగా ఢిల్లీలోని తబ్లిగీ జమాతే మత సమవేశాలకు హాజరైన వారివే. ఈ సమావేశాలకు వెళ్లిన వారందర్నీ గుర్తించి.. ఎక్కడిక్కడ టెస్టులు చేయిస్తూ… పాజిటివ్ వచ్చిన వారిని…వారితో కాంటాక్ట్‌లో ఉన్న వారిని క్వారంటైన్ చేస్తున్నారు. ఈ కారణంగానే… పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.
కేంద్ర ప్రభుత్వం కానీ.. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ.. తబ్లిగీ జమాతే ప్రార్థనల వల్ల.. కరోనా వ్యాపిస్తుందని అస్సలు అంచనా వేయలేకపోయారు. ప్రభుత్వాల దృష్టి అంతా.. విదేశాల నుంచి వచ్చే వారిపైనే ఉంది. ఫిబ్రవరి నుంచి దేశంలోకి వచ్చిన వారి వివరాలన్ని దగ్గర పెట్టుకుని వారందర్నీ క్వారంటైన్ చేయడంపైనే ఉంది. కరోనా లక్షణాలున్న వారిని ట్రేస్ చేయడానికే అధికారులు సమయం వెచ్చించారు. ఇప్పుడు… ఆ విదేశాల నుంచి వచ్చిన వారందరి క్వారంటైన్… ఏడో తేదీతో పూర్తయిపోతుంది. వైరస్ సోకిన పధ్నాలుగు రోజులకు లక్షణాలు బయటపడతాయి. ఈ లోపు ఎవరికైనా కరోనా సోకి ఉంటే.. వారందరికీ బయటపడేది. అలా బయటప డిన వాళ్లందరూ బయటకు వచ్చారు. మిగిలిన వారికి లేనట్లే. అంటే… తబ్లిగీ సభ్యులు లేకపోతే…భారత్‌లో … కరోనా చాలా తక్కువ స్థాయిలోనే ఉండేది.
తబ్లిగీ సభ్యుల వైపు నుంచి ఇంతా పెద్ద ముప్పు ఉంటుందని ఊహించలేకపోయిన తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా… ఏప్రిల్ ఏడో తేదీ కల్లా.. తెలంగాణను కరోనా ఫ్రీ స్టేట్‌గా చేస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం..దేశంలోనే అతి తక్కువ కరోనా కేసులున్న రాష్ట్రమని … క్లెయిమ్ చేసుకుంది. కానీ తర్వాత పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం తబ్లిగీ సభ్యులు…వారి ద్వారా ఇతరులకు వైరస్ సోకిన కేసులు మాత్రమే పాజిటివ్‌గా తేలుతున్నాయి. భారత్‌లో కరోనా టెస్టులు పరిమితంగానే జరుగుతున్నాయి. అదే సమయంలో..కరోనా లక్షణాలతో పెద్ద ఎత్తున ఆస్పత్రుల్లో ఎవరూ చేయడం లేదు. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఆరోగ్య సర్వే చేస్తున్నారు. అనుమానితులు భారీగా ఉండటం లేదు. ఇవన్నీ మంచి సంకేతాలేనన్న చర్చ నడుస్తోంది.