ఏప్రిల్ పధ్నాలుగో తేదీతో.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించిన లాక్ డౌన్ గడువు పూర్తయిపోతుంది. మళ్లీ మంచి రోజులు వస్తాయని.. బస్సులు, రైళ్లు, విమానాయాన సంస్థలు బుకింగ్‌లు ప్రారంభిస్తున్నాయి. అయితే.. ఒకే సారి కాకుండా.. కొన్ని కీలకమైన సర్వీసులకు బుకింగ్‌లు ప్రారంభిస్తున్నారు. ప్రభుత్వ రంగంలో ఉండే సర్వీసులు కూడా బుకింగ్‌లు ప్రారంభించడంతో.. లాక్ డౌన్ ఎత్తివేస్తారని ప్రజలు నమ్మతున్నారు. కానీ ఎక్కడా.. కరోనా పాజిటివ్ కేసులుతగ్గడం లేదు సరి కదా అంతకు అంత పెరుగుతున్నాయి. ఈ కారణంగా లాక్ డౌన్ ఎత్తివేయడం అసాధ్యమనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. .
లాక్ డౌన్ పొడిగిస్తే.. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం దేశాన్ని చుట్టుముడుతుందని నిపుణులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అదే జరిగితే.. ప్రజల ఆరోగ్యం కాపాడినా… దేశ ఆర్థిక ఆరోగ్యం దెబ్బతింటుంది. రెండింటిని కాపాడాలంటే.. తప్పనిసరిగా.. వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. లాక్‌డౌన్ ఒకే సారి ఎత్తివేస్తే.. ఒక్క సారిగా ఒళ్లు విరుచుకుని రోడ్లపైకి వచ్చేస్తారు. దాంతో.. ఇన్ని రోజులు.. లాక్ డౌన్ అయిన కష్టం కొట్టుకుపోతుంది. ఈ విషయం తెలిసిన ప్రధానమంత్రి.. కూడా… పాక్షిక లాక్ డౌన్ ఎత్తివేత సూచనలు ప్రజల్లోకి పంపుతున్నారు. పాక్షిక లాక్ డౌన్ అంటే.. అనేక రకాల ఆంక్షలతో… లాక్ డౌన్ సడలింపు ఇవ్వడం. ఇందులో ప్రధానమైనది.. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న వారే ప్రయాణించేలా నిబంధనలు విధించడం.
చైనాలో ప్రజలందరికి మూడు రకాల స్టాంపులు వేసింది. మూడు రంగుల్లో ఉండేలా.. టెక్నికల్ స్టాంపులు..ప్రజలకు కేటాయించింది. అనారోగ్యంగా ఉన్న వారు ఎవరైనా సరే ఇళ్లకే పరిమితం చేసింది. అత్యవసరమైన వాటి కార్యకలాపాలకు అడ్డం లేకుండా చూసింది. వీలైనంత వరకూ… ప్రజలు రోడ్ల పైకి రాకుడా చూసింది. కరోనా భయం లేదని తేలిన తర్వాత మాత్రమే వారు.. రోజువారీ జీవితంలోకి రాగలరు. అప్పటి వరకూ ప్రభుత్వాలు కూడా…తమ వంతు కట్టడి ప్రయత్నాలు చేస్తాయి. అందుకే.. ఏప్రిల్ పధ్నాలుగో తేదీన లాక్ డౌన్ ఎత్తివేతకే అవకాశం ఉంటుంది. అయితే అది పూర్తి స్థాయిలో కాదు.. ఆంక్షలతో.. ఈ లాక్ డౌన్ అమలు కొనసాగుతుంది. మరో నాలుగైదుల నెలల పాటు.. కరోనా భయంతో ప్రజలు… ఏం చేయాలన్నా.. ఆలోచించక తప్పదు.