భారతీయ జనతా పార్టీ తమ పార్టీ కార్యకర్తలకు ఓ కొత్త టాస్క్ ఇచ్చింది. పార్టీ కార్యకర్తలందరూ.. ఓ పూట భోజనం మానేయాలని సూచించింది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవం. ఈ సందర్భంగా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా.. ఈ మేరకు కార్యకర్తలకు కొన్ని సూచనలు చేశారు. కార్యకర్తలందరూ.. ఓ పూట భోజనం మానేయాలన్నది ఆ సూచనల్లో ఒకటి. ఫీడ్ ద నీడ్ అనే కార్యక్రమం ప్రకటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ప్రతి కార్యకర్త .. ఆరుగురు పేదలకు భోజనం పెట్టాలని నిర్దేశించారు. అలాగే పోలింగ్ కేంద్రం స్థాయిలో.. ఓ కార్యకర్త.. ఇద్దరికి మాస్క్‌లు అందించాలని పిలుపునిచ్చారు. అలాగే.. కరోనాపై పోరాడుతున్న వారికి కృతజ్ఞతలు చెప్పాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా… కార్యకర్తలకు ఇదే సందేశం ఇచ్చారు.
పార్టీ వ్యవస్థాప దినోత్సవం సందర్భంగా సందశం ఇచ్చిన నరేంద్రమోడీ.. కోవిడ్ -19 పై పోరాడుతున్న వారికి సంఘిభావంగా ఓ పూట భోజనం మానేయాలన్నారు. పార్టీ చేసిన ఈ సూచనను అందరూ పాటించాలని పిలుపునిచ్చారు. పార్టీ వ్యవస్థాపక కార్యక్రమాల్లో సామాజిక దూరం పాటించాలని సూచించారు. నరేంద్రమోడీ, జేపీ నడ్డా.. ఈ సారి ఒక్క పూట భోజనం మానేసి.. ఆరుగురికి పెట్టాలన్న కాన్సెప్ట్‌ను.. కేవలం భారతీయ జనతా పార్టీకే పరిమితం చేశారు. ఆ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఈ టాస్క్ ఇచ్చారు. కరోనాలాక్ డౌన్ ప్రకటించిన తర్వాత రెండు సార్లు సాధారణ ప్రజలకు టాస్క్ ఇచ్చారు. ఓ సారి చప్పట్లు కొట్టాలని.. మరోసారి దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు.
ప్రజలు విపరీతంగా స్పందించారు. ఇప్పుడు బీజేపీ కార్యకర్తలకు మాత్రమే భోజనం మానేయాలని పిలుపునిచ్చారు కాబట్టి.. వారు మరింత ఉత్సాహంగా ఈ కార్యక్రమం జరిపే అవకాశం ఉంది. అలాగే.. పెద్ద ఎత్తున పేదలకు. బీజేపీ నేతలు, కార్యకర్తలు… భోజనాలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. రోజుకూలీలకు ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో కడుపు నిండా తిండి దొరకని పరిస్థితి ఉంది. మోడీ టాస్క్‌తో కొంత వరకైనా వారికి బీజేపీ కార్యకర్తలు కడుపు నింపే అవకాశం ఉంది.