వైరస్ అంకంతకూ వ్యాపిస్తూండటంతో తెలంగాణ సర్కార్ కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో పాన్, తంబాకు ఉమ్మి వేయడాన్ని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధం తక్షణమే అమల్లోకి వచ్చింది. వైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగా ప్రజారోగ్యం దృష్ట్యా…నిర్ణయం తీసుకున్నట్లుగా భుతవం చెప్పింది. తుమ్ము తుంపరలు, ఉమ్మి, తెమడ వల్ల కరోనా వ్యాపిస్తుండటం.. ఒక వ్యక్తి ద్వారా నెలలో ఈ వైరస్ 406 మందికి వ్యాప్తి చెందుతుందని ఐసీఎంఆర్ సర్వేలో తేలడంతో.. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు.
ఢిల్లీ నుంచి వచ్చిన తబ్లిగీల వల్ల.. విపరతీంగా.. వైరస్ కేసులు బయటపడుతున్నాయి. వారు.. వారి కాంటాక్ట్ కేసుల కారణంగా… తెలంగాణలో.. పాజిటివ్ కేసులు.. అంతకంతకూ పెగిరిపోతున్నాయి. ఏప్రిల్ ఏడో తేదీ కల్లా… కరోనా ఫ్రీ స్టేట్‌గా ఉంటుందని కేసీఆర్ భావించారు. కానీ ఆ తర్వాతే.. తబ్లిగీల కేసులు బయటకు వచ్చాయి. దాంతో.. ఇప్పుడు.. కేసులు 450కి చేరువుగా వచ్చాయి. ఈ కారణంగా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. లాక్ డౌన్‌ను ఎత్తివేయవద్దని.. మొదటిగా.. తెలంగాణ సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. మిగిలిన రాష్ట్రాలు సమర్థిస్తున్నాయి.
తెలంగామలో వైరస్ వ్యాప్తి అయ్యే ప్రాంతాలుగా.. నాలుగు రోజులు కిందట.. 50 ప్రాంతాలనే హాట్ స్పాట్లుగా గుర్తించారు. కానీ ఇప్పుడు.. ఆ సంఖ్యను.. 125 కు పెంచారు. హైదరాబాద్ పరిధిలోనే 60 హాట్ స్పాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హాట్స్పాట్లలో ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ ముందు నిర్ణయించింది. ఆ ప్రాంతాల్లో 3,500 వైద్య బృందాలను మోహరించారు. మరో రెండు రోజుల పాటు భారీగా పాజిటివ్ కేసులు బయటపడతాయని.. ఆ తర్వాత తగ్గిపోతాయని.. ఈటల చెబుతున్నారు. అయితే.. పరిస్థితులు అలా లేవని.. నిపుములు విశ్లేషిస్తున్నారు.