ఆంధ్రప్రదేశ్‌లో గత పన్నెండు గంటల్లో ఒక్కటంటే.. ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. నిన్న రాత్రి తొమ్మిది గంటల నుండి ఈ ఉదయం తొమ్మిది గంటల వరకూ… చేసిన 217 శాంపిల్స్ టెస్టుల్లో ఒక్కటి కూడా పాజిటివ్ కేసు రాలేదని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఏపీలో348 పాజిటివ్ కేసులు ఉన్నాయి. కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తూండటం.. ఢిల్లీ నుంచి వచ్చిన తబ్లిగీలు..వారి కాంటాక్ట్లన్నింటిపైనా… అధికారులు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి క్వారంటైన్లకు తరలించడంతో.. ముప్పు తప్పిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
రెడ్ జోన్లలో ఉన్న అనుమానితులు… అనుమానితులు కాని వారిని కూడా.. ర్యాండమ్‌గా టెస్టులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు.. ఇప్పటికే మూడో సారి.. ఇంటింటి సర్వేను ఏపీ సర్కార్ ప్రారంభించారు.దాదాపుగా కోటిన్నర కుటుంబాలు ఏపీలో ఉండటంతో అందరి ఇళ్లకు వెళ్లి.. ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని.. అనుమానితులు ఉంటే.. వారందర్నీ.. తక్షణం క్వారంటైన్‌కు తరలించడమో..వారి శాంపిళ్లను పరీక్షించి.. వైరస్ ఉందో లేదో తేల్చడమో చేయాలని నిర్ణయించారు.
ఇప్పటికి రెండు సార్లు ఇంటింటి సర్వే నిర్వహించారు. అయితే.. పలువురు కరోనా లక్షణాలతో ఉన్న వారిని గుర్తించలేకపోయారనే విమర్శలు వచ్చాయి. ఇప్పటికే ఏపీలో.. విదేశాల నుంచి వచ్చినవారి క్వారంటైన్ పూర్తయింది.వారిలో అనుమానితులు పెద్దగా లేరు. ఉన్న వారిని ఐసోలేషన్ లో ఉంచారు. ప్రస్తుత పరిస్థితి మెరుగ్గా ఉందని… ఇక కరోనా కేసులు బయటపడినా..పెద్ద ఎత్తున ఉండవని..ఏపీ ప్రభుత్వ వర్గాలు అంచనాతో ఉన్నాయి.