ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో.. కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇంతకు ముందు ఉన్న ఆంధ్రప్రదేశ్ కంటెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ను.. మూసేసి.. దానికి బదులుగా.. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ ను ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించింది. వెంటనే దీనికి వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్గా .. చిన్న వాసుదేవరెడ్డిని నియమించారు. ఓ ప్రొఫెనషల్ టీమ్ ఆధ్వర్యంలో ఇది నడుస్తుందని చెప్పారు. అంటే.. చిన్న వాసుదేవరెడ్డి .. పలువుర్ని.. ఈ కార్పొరేషన్ లోకి తీసుకుని ఉద్యోగాలు కల్పించవచ్చన్నమాట.
ఎన్నారై అయిన చిన్న వాసుదేవరెడ్డి..ఐడ్రీమ్ మీడియా పేరుతో..సోషల్ మీడియాలో… మంచి నెట్ వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఆయనకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లారు. అక్కడ తిరగడానికి … ప్రత్యేక విమానాలను.. చిన్న వాసుదేవరెడ్డినే స్పాన్సర్ చేసినట్లుగా చెబుతారు. ఏపీ సర్కార్ గొప్ప తనాన్ని ప్రజలకు తెలియచేయడం… విపక్ష పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని కట్టడి చేయడానికి సోషల్ మీడియాలో మంచి ఫ్లాట్ ఫాం కావాలన్న ఉద్దేశంతో జగన్ ఈయనకు పదవి ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం ఉద్ధృతంగా సాగుతోందని. .. తాము కట్టడి చేయలేకపోతున్నామని ప్రభుత్వం భావిస్తోంది.
నిజానికి చిన్న వాసుదెవరెడ్డికి గత నవంబర్లోనే ఓ పదవిని జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. చీఫ్ డిజిటల్ డైరక్టర్ గా నియమించారు. ఇప్పుడు నేరుగా.. కంటెంట్ కార్పొరేషన్ ను.. క్లోజ్ చేసి.. డిజిటల్ కార్పొరేషన్ గా మార్చేసి.. వైస్ చైర్మన్.. మేనేజింగ్ డైరక్టర్ పదవి కట్టబెట్టేశారు. ఓ వైపు వైరస్ ప్రభావంతో… అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మిగతా ఏ విషయాలు పట్టించుకోకుండా.. పరుగులు పెడుతూంటే.. ఏపీ సర్కార్.. సలహాదారులు… కార్పొరేషన్ చైర్మన్ల నియామకాలతో.. టైంపాస్ చేస్తోంది.