ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్‌తో పొత్తు కోసం వైసీపీ ప్రయత్నించిందా..?. అప్పట్లో పత్రికల్లో రకరకాల ఊహాగానాలు వచ్చాయి కానీ.. దేనికీ క్లారిటీ లేదు. ఇప్పుడు.. మాత్రం.. స్పష్టత వస్తోంది. పొత్తుల కోసం చర్చలు జరిగాయని… స్వయంగా.. నాగేంద్రబాబు ప్రకటించారు. విజయసాయిరెడ్డి ద్వంద్వ ప్రమాణాలను బయట పెట్టడానికి నాగేంద్రబాబు ఓ సంచలన విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా.. నాగబాబు ఇంటికి వెళ్లిన విజయసాయిరెడ్డి.. పవన్ కల్యాణ్‌తో పొత్తులు పెట్టుకునేందుకు సిద్ధమని ఆఫర్ ఇచ్చారు. ఆ తర్వాత అ ప్రతిపాదన ఏ స్థాయి వరకు వెళ్లిందో ఎవరికీ తెలియదు. ఎందుకు ఆగిపోయిందో తెలియదు. తర్వాత ఎప్పుడైనా నాగబాబే మళ్లీ విషయాలను ప్రకటించాలి.
ఇప్పుడు ఈ విషయాలను.. నాగబాబు ఎందుకు బయట పెట్టారంటే.. అసలు పవన్ కల్యాణ్‌కు బేసే లేదని.. ఆయన రాజకీయాలకు దండగన్నట్లుగా విజయసాయిరెడ్డి ట్వీట్లు పెడుతూండటంతో.. కడుపు మండిపోయిన..మెగా బ్రదర్ ఇలా రిప్లయ్ ఇచ్చారు. ఎన్నికలకు ముందు పొత్తుల కోసం వచ్చి ఇప్పుడు.. పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తూండటాన్ని… విజయసాయిరెడ్డి డబుల్ స్టాండర్డ్స్ ను భరించలేక.. నాగబాబు ఫైరయిపోయారు. ఈ విషయాన్ని బయట పెట్టారు. సాదాసీదాగా చెప్పలేదు. విజయసాయిరెడ్డిని గుంటనక్కతో పోల్చి మరీ చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయిరెడ్డి నెంబర్ టు. మొత్తం పనులు ఆయనే చక్క బెడతారు. ఇప్పటి నుంచి కాదు ఎన్నికల ముందు నుంచీ అంతే. అప్పుడు పవన్ కల్యాణ్‌తో వైసీపీ కలిస్తే.. టీడీపీ ఓడిపోవడం ఖాయమన్న విశ్లేషణలు వచ్చాయి. దాని ప్రకారం పొత్తుల కోసం ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది.
ఇప్పుడు పవన్ కల్యాణ్‌ను విమర్శించాల్సినంత అవసరం కూడా విజయసాయిరెడ్డికి లేదు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో.. తాను రాజకీయం చేయనని.. ప్రభుత్వాన్ని విమర్శించనని… పవన్ కల్యాణ్ ప్రకటించారు. సహజంగా అయితే్..ఈ నిర్ణయంపై వైసీపీ సైలెంట్ గా ఉండాలి. కానీ విజయసాయిరెడ్డి..ఇలా సైలెంట్ గా ఉండకుండా.. సైలెంట్ గా ఉంటాన్న పవన్ కల్యాణ్‌పై అనుచితంగా ట్విట్టర్లో విమర్శించారు. చివరికి మెగా బ్రదర్‌తో గుంటనక్క అనిపించుకుని.. దానికి తగ్గట్లుగా ఓ పాత పొత్తుల ప్రయత్నాన్ని కూడా వెలుగులోకి వచ్చేలా చేశారు.