రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా ప్రారంభమైన చానల్ AP24/7. సీనియర్ జర్నలిస్ట్ వెంకటకృష్ణ .. చానల్ ఫేస్‌గా ప్రారంభమయింది. ఆయన అగ్రెసివ్ డిస్కషన్ స్టైల్ చానల్‌కు ఓ గుర్తింపు తీసుకు వచ్చింది. ఒకప్పుడు.. మా టీవీ వ్యవస్థాపకునిగా ఉన్న.. మురళీకృష్ణంరాజు చైర్మన్‌గా ఉండటంతో.. చానల్‌కు మంచి భవిష్యత్ ఉందని అనుకున్నారు. మొదట్లో.. ప్రజల ఆదరాభిమానాలను కూడా పొందింది. తర్వాత ఏమయిందో కానీ.. ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంది. సీనియర్ ఉద్యోగుల మధ్య రచ్చ ప్రారంభమయింది. చివరికి.. ఆ చానల్ నుంచి… వెంకటకృష్ణ వైదొలగడం ఖాయమయింది. కొన్ని రోజు క్రితం… తన చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించేసిన మురళీకృష్ణంరాజు … ఇప్పుడు వెంకటకృష్ణ చానల్ నుంచి వెళ్లిపోయేందుకు అంగీకరించడంతో.. మళ్లీ తాను యాక్టివ్ కావాలని నిర్ణయించుకున్నారు. చైర్మన్ కమ్ మేనిజింగ్ డైరక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నారు.
చానల్ యాజమాన్య పొజిషన్లో ఎవరున్నారనేది ప్రేక్షకులకు పట్టింపు కాదు. అసలు వారికి అది అనవసరం. స్క్రీన్‌పై ఏమి వస్తుంది.. ? ఎంత ఎగ్రెసివ్ జర్నలిస్టులు దాన్ని నడుపుతున్నారు.. ? ఎంత మేర ప్రజల విశ్వసనీయత పొందుతోంది అన్నది కీలకం. AP24/7లో ఉన్న ఒకే ఒక్క ప్రామినెంట్ ఫేస్ వెంకటకృష్ణ. ఆయన కూడా.. ఆ చానల్లో కనిపించడం మానేస్తే.. తొలి ఆంధ్ర చానల్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయనే అంచనా ఉంది. ప్రస్తుతం.. ప్రతి ఒక్క చానల్‌కు.. ఒక్కో ప్రముఖ జర్నలిస్ట్ బ్రాండ్ అంబాసిడర్లా వ్యవహరిస్తున్నారు. డిస్కషన్లు.. ఇతర ఎడిటోరియల్ స్టాండర్డ్స్‌ను మెయిన్‌టెయిన్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు AP24/7 ఆ ప్లస్ పాయింట్ ను కోల్పోతోంది. టీఆర్పీలు మెరుగ్గా సాధిస్తేనే.. చానల్ సర్వైవ్ అవుతుంది. సాదాసీదాగా.. వార్తలు ప్రజెంట్ చేస్తే.. ఇప్పుడు నడిచే చాన్స్ లేదు. ఓ ప్రామినెంట్ ఫేస్‌ను పెట్టుకుని.. చానల్‌ను రన్ చేయాల్సి ఉంటుంది. ఆ అడ్వాంటేజ్ ఇక AP24/7కి ఉండకపోవచ్చు.
తెలుగు రాష్ట్రాల విభజన జరిగి ఆరేళ్లు దాటిపోతున్నా… ఇంత వరకూ మీడియా ఏపీకి షిఫ్ట్ కాలేదు. ఇంకా హైదరాబాద్ కేంద్రంగానే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అసలు ఏపీకి వెళ్లాలనే ఆలోచననే ఇతర మీడియా సంస్థలు చేయడం లేదు. కరోనా కన్నా ముందే రాజధానిపై సందిగ్ధత… ఉండటం…ఒక్క ఏపీ కోసమే.. నెట్ వర్క్ నడుపుకుంటే లాభదాయకత కాదన్న అంచనాలు.. ప్రభుత్వం సహకారం ఉండదనే నిర్ణయాలకు రావడం వల్ల.. ఏపీకి మీడియా వెళ్లడం లేదు. ఇప్పుడు… ఏపీ కేంద్రంగా నడుస్తున్న AP24/7కి కూడా.. ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి.