పింక్ రీమేక్‌ని తెలుగులో తీస్తున్నప్పుడు పవన్ కల్యాణ్ ఇమేజ్‌కీ, ఫ్యాన్ ఫాలోయింగ్‌కి తగినట్టుగా కీలకమైన మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందులో భాగంగా హీరోయిన్ పాత్ర నిడివి పెంచారు. పాటలూ జోడించారు. అయితే ఇప్పుడు వాటికి కత్తెర పడినట్టు సమాచారం. లాక్ డౌన్ వల్ల షూటింగ్ ఆగిపోయింది. మళ్లీ షూటింగులకు ఎప్పుడు అనుమతి ఇస్తారో తెలీదు. షూటింగులు తిరిగి మొదలైతే… చక చక ఈ సినిమాకి సంబంధించిన పనులు పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. అందులో భాగంగా `అనవసరమైన` సన్నివేశాలు, హంగుల్ని తొలగించడానికి చిత్రబృందం భారీ ఎత్తున కసరత్తు చేసింది. హీరోయిన్ పాత్రని ట్రిమ్ చేసినట్టు కూడా సమాచారం. ఆమెతో డ్యూయెట్లని సినిమా నుంచి తొలగించారని తెలుస్తోంది. శ్రుతిహాసన్ని హీరోయిన్ గా ఖాయం చేసినా, అధికారికంగా ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. హీరోయిన్ ఎవరైనా సరే.. వారం రోజుల్లోనే ఆమెకు సంబంధించిన సన్నివేశాల్ని పూర్తి చేసే ఆలోచనల్లో ఉంది చిత్రబృందం.