ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల పరిస్థితి సంక్షోభంలో ఉన్నప్పటికీ.. వివాదాస్పద కొనుగోళ్ల వ్యవహారంలో ముందుకే వెళ్తున్నాయి. ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ పూర్తిగా తగ్గిపోయింది. విద్యుత్ బిల్లులు సగం కూడా వసూలు కావడం లేదు. సంక్షోభంలో ఉన్నామని… విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే.. వారు చేయాల్సిన పనులు మాత్రం చేస్తూనే ఉన్నారు. ఏ మాత్రం లాభదాయకత కాదని.. అసలు ఉపయోగకరమే కాదని.. నిపుణులు అంచనా వేస్తున్న చత్తీస్‌గఢ్‌లోని అథెనా విద్యుత్ ప్లాంట్ కొనుగోలుకు.,.. చకచకా అడుగులు వేసేస్తున్నారు. ఆ ప్లాంట్ కొనుగోలుకు టెండర్ దాఖలు చేయాలని జెన్కో నిర్ణయించుకుంది.
నిజానికి అథెనా పూర్తి స్థాయిలో ఉత్పత్తికి సిద్ధం కాలేదు. ఆసంస్థ దివాలా పిటిషన్లు ఎన్సీఎల్టీలో ఉన్నాయి. ఇలాంటి అవసరం లేని కంపెనీని ఎవరూ కొనుగోలు చేయాలన ఆసక్తి కూడా చూపరు. కానీ ప్రభుత్వం మారినప్పటి నుండి జెన్కో ఆ ప్లాంట్ పై ఎక్కడ లేని ఆసక్తి కలుగుతోంది. మొదట్లో… అసలు ఈ ప్లాంట్ కొనుగోలు ఆలోచన చేయడమే కరెక్ట్ కాదని.. ఊరుకున్నారు. మళ్లీ తర్వాత కొనుగోలు చేయాల్సిందేనని పట్టుదల ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు అసలు కోల్ లింకేజీ కూడాలేదు. పైగా… ఇప్పటికే ఉత్పత్తి చేస్తామని చెప్పి.. విద్యుత్ ను అమ్మేయడానికి పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్లు కుదుర్చుకున్నారు కూడా. అంతే కాదు.. ఈ ప్లాంట్‌కు సంబంధించిన యంత్రాలు ఆర్థిక వివాదాల కారణంగా.. పోర్టుల్లోనే ఉన్నాయి.
ఈ వివాదాలన్నీ ఉండగా… ప్లాంట్ ను కొనుగోలు చేస్తే ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో… కోల్ లింకేజీ, పీపీఏల రద్దు, మిషనరీ తెప్పించే బాధ్యతలను తీసుకోవాలనే షరతులతో టెండర్ వేయాలని జెన్ కో వర్గాలు నిర్ణయించాయి. అసలు ఎక్కడో చత్తీస్‌గఢ్‌లో ఉన్న విద్యుత్ ప్లాంట్ ను కొనుగోలు చేయాలనుకోవడం సరి కాదని.. అలాంటిది.. ఇంకా.. అనేక లొసుగులు ఉన్న..కంపెనీని ఎలా కొనుగోలు చేయాలనే ఆలోచన చేస్తారని.. నిపుణుల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. కొంతమంది ఉన్నతాధికారులు కూడా ఈ వ్యవహారంలో తాము భాగం కాకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీలోని కొంత మంది ఒత్తిడి మేరకే.. కొన్ని వేల కోట్లతో అథెనా కొనుగోలు ప్రక్రియ జరుగుతోందన్న అనుమానాలను విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి.