కరోనా వల్ల సినిమా ఏమైపోతుందో? ఎక్కడికి పోతుందో? జనాలు థియేటర్లకు వస్తారో రారో..
– ఇలా ఎన్ని భయాలో. 2020ని చిత్రసీమ మర్చిపోవాల్సిందేనని సినీ విశ్లేషకులు కూడా డంకా బనాయించి మరీ చెబుతున్నారు.కొత్త భయాలు రేపుతున్నారు. కానీ చిరంజీవి మాత్రం `అసలేమాత్రం భయపడాల్సిన పనిలేద`ంటూ అభయహస్తం అందిస్తున్నారు. కరోనా వల్ల పడిన బ్రేకు తాత్కాలికమే అని, త్వరలో చిత్రసీమ పుంజుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కరోనా వల్ల సినిమాలు బాగా నష్టపోతున్నాయని, మళ్లీ పుంజుకోవడానికి చాలా కాలం పడుతుందన్నది విశ్లేషకుల మాట. కానీ చిరు ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. బడ్జెట్లు కుచించుకుపోవడం, సినిమాలుతగ్గిపోవడం జరగదని, ఈ దెబ్బ కొంతకాలమేనని, మళ్లీ జనాలు థియేటర్లుకు ఇది వరకటిలానే వస్తారని చిరు చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో చిత్రసీమ భయపడాల్సిన అవసరం లేదన్నాడు. అయితే ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్‌లకు ఆదరణ పెరుగుతోందని, తాను కూడా వాటిపై దృష్టి సారిస్తున్నానని, వెబ్ సిరీస్‌లలో ప్రతీ నటుడు, నటీ తమని తాము కొత్తగా ఆవిష్కరించుకునే అవకాశం దక్కుతోందని చెబుతున్నాడు పూరి. త్వరలోనే ఓ మెగా వెబ్ సిరీస్‌ని చూసే అవకాశం ఉందని చిరు హింట్ ఇచ్చాడు. మరి అదెప్పుడు మొదలవుతుందో, వాటి వెనుక చిరు ప్రమేయం ఎంతో తెలుసుకోవాలంటే ఇంకొంత కాలం ఆగాలి.