‘ఉప్పెన’లో విజయ్‌సేతుపతి ఓ కీలకమైన పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం విజయ్‌సేతుపతికి భారీ పారితోషికం ముట్టజెప్పింది చిత్రబృందం. దానికి తగ్గట్టుగానే విజయ్ వల్ల ఈ సినిమాకి క్రేజ్ పెరిగింది. బిజినెస్ పరంగానూ కలిసొచ్చింది. ఇప్పుడు ఈ సినిమా తమిళ రీమేక్ రైట్స్‌ని విజయ్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. అక్కడ ఈ సినిమాని విజయ్ సేతుపతి రీమేక్ చేయబోతున్నాడని టాక్. నిజానికి ఉప్పెనని తమిళంలో డబ్ చేసి విడుదల చేద్దామనుకుంది చిత్రబృందం. విజయ్‌సేతుపతిని తీసుకోవడానికి కూడా కారణం అదే. విజయ్ వల్ల తమిళ మార్కెట్ ఓపెన్ అవుతుందని భావించారు. అయితే ఈ కథ తనకు వ్యక్తిగతంగా బాగా నచ్చడం వల్ల రీమేక్ రైట్స్‌ని సొంతం చేసుకున్నాడు. తమిళ రీమేక్‌లో మైత్రీ మూవీస్, సుకుమార్‌లు కూడా నిర్మాణ భాగస్వాములుగా ఉండే అవకాశం ఉంది.