ఎన్నికల్లో మళ్లీ గెలుపొందే లక్ష్యంతో అగ్రదేశం అమెరికాను ప్రపంచానికి దూరం చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. వైరస్ విషయంలో పూర్తి స్థాయి నిర్లక్ష్యం ప్రదర్శించి…కొన్ని వేల మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యారనే విమర్శలు చుట్టుముడుతూడటంతో… భావోద్వేగ బాటను ఎంచుకున్నారు. అమెరికాలోకి విదేశీయుల రాకను నిషేధిస్తూ… ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను పాస్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. అమెరికన్ల ఉద్యోగాలను కాపాడటడానికే ఈ చర్య తీసుకుంటున్నానని..ఓటర్లను సెంటిమెంట్ల మీద కొట్టే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం కరోనా కారణంగా అమెరికాలో నిరుద్యోగిత అమాంతం పెరిగింది. లాక్ డౌన్ కారణంగా కొన్ని లక్షల ఉద్యోగాలు పోయాయి. దీంతో అమెరికాలో పేదరికం పెరుగుతోంది.
లాక్ డౌన్ నిబంధనలు… ప్రభుత్వ వైఫల్యాలు.. ఉపాధి పోవడం… చివరికి నిత్యావసర వస్తవులూ అందుబాటులో తేలేకపోవడం వంటి వాటితో.. ట్రంప్… ప్రతిష్ట పూర్తి స్థాయిలో మసకబారింది. ఏం జరిగినా సరే.. నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో … రెండో సారి గెలవాలనుకుంటున్న ట్రంప్.. దానికి తగ్గరి మాత్రం.. అమెరికనిజాన్ని ప్రజల్లో రెచ్చగొట్టడమేనని నిర్ణయానికి వచ్చారు. అందుకే ఇక విదేశీయుల్ని రానివ్వబోననే ప్రకటన చేశారు. నిజానికి అమెరికాలో నిఖార్సైన అమెరికన్లు .. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు ఎప్పుడో కలిసిపోయారు. అక్కడ ఉన్న పౌరసత్వ చట్టాల ప్రకారం.. మెజార్టీ అమెరికన్లు… ఇతర దేశాల మూలలకు చెందిన వారు ఉంటారు. గ్రీన్ కార్డుల ద్వారా.. శాశ్వతపౌరసత్వాన్ని పొందిన వారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు.
అమెరికాలో ప్రపంచంలోని ప్రతీ దేశానికి చెందిన పౌరులు నివసిస్తూ ఉంటారు. దశాబ్దాలుగా… ప్రపంచంలోని మెరుగైన ప్రతిభ ఉన్న యువతను అమెరికా ఆకర్షించింది. వారి ద్వారా సేవల రంగంలో అనితర సాధ్యమైన విజయాలు సాధించింది. ఆర్థికంగా.. గొప్ప శక్తిగా ఎదిగింది. ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చిన వారే.. అమెరికా ఆర్థికాభివృద్ధిలో కీలకం. ఈ విషయం… ట్రంప్ కు తెలియనిదేం కాదు. అయినా…ఎన్నికల్లో గట్టెక్కడానికి.. ప్రజల్లో అమెరికన్ అనే భావన రెచ్చగొట్టడం ఒక్కటే పరిష్కారంగా భావిస్తున్నారు. ఆ మేరకు ముందడుగు వేస్తున్నారు. ఇప్పటికే అమెరికా అగ్రరాజ్యహోదాకు గండం వచ్చి పడింది. ఇప్పుడు… అందరికీ దూరం అయిపోయి.. ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితి కూడా ట్రంప్ నిర్ణయాల వల్ల ఏర్పడుతోంది.