‘నిశ్శబ్దం’ సినిమా మొదలైనప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఈ సినిమాపై వస్తున్న రూమర్లకు లెక్కలేదు. ముఖ్యంగా ఆ రూమర్లన్నీ అనుష్క చుట్టూనే కేంద్రీకృతమై నడుస్తున్నాయి. చిత్రబృందానికీ అనుష్కకీ అస్సలు పడడం లేదని, అనుష్క ఏమాత్రం సహకరించడం లేదని, ప్రమోషన్లకు రానని తెగేసి చెప్పేస్తోందని.. ఇలా రకరకాల న్యూసులు. కరోనా ఎఫెక్ట్ వల్ల ‘నిశ్శబ్దం’ రిలీజ్ ఆగిపోయింది. ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి డవలప్మెంట్స్ లేవు. అయినా సరే.. రూమర్లకు ఫుల్ స్టాప్ పడలేదు. దాంతో చిత్రబృందం ఈ విషయంపై స్పందించాల్సివచ్చింది.
ఈ సినిమా మొదలైనప్పటి నుంచీ ఇప్పటి వరకూ నటీనటులు, సాంకేతిక నిపుణులు అందిస్తున్న సహకారం మర్చిపోలేదని, ముఖ్యంగా అనుష్క కష్టకాలంలో కూడా తమకు అండగా నిలిచిందని, ఈ సినిమాపై వస్తున్న ఎలాంటి రూమర్లనీ నమ్మొద్దని, త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ఇస్తామని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ట్విట్టర్లో పేర్కొంది. ఇకనైనా ఈ పుకార్లు ఆగుతాయేమో చూడాలి.