విజయసాయిరెడ్డి భారతీయ జనతా పార్టీలో తాను టార్గెట్ చేసిన నేతల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారు. మొదట సుజనా చౌదరి.. ఆ తర్వాత సుజనాతో పాటు కన్నా లక్ష్మినారాయణ .. ఇప్పుడు వారితో పాటు పురందేశ్వరిని కూడా కలిపారు. గత ఎన్నికల్లో బీజేపీ హైకమాండ్ పెద్ద ఎత్తున ఏపీకి నిధులు పంపిందని.. వాటిని కన్నా లక్ష్మినారాయణ, పురందేశ్వరి కాజేశారని ఆరోపించారు. బీజేపీ హైకమాండ్ తనకు ఎంత పంపిందో తెలుసని.. కన్నా, పురందేశ్వరి ఎంతెంత తీసుకున్నదో కూడా తెలుసని విజయసాయిరెడ్డి బెదిరిపంు ధోరణిలో చెప్పుకొచ్చారు. ఆరోపణల స్థాయి నుంచి విజయసాయిరెడ్డి తీరు బెదిరంపు ధోరణిలోకి వెళ్లింది. ఇప్పటికీ. తాను కన్నా లక్ష్మినారాయణ ఇరవై కోట్లకు అమ్ముడుపోాయరనే ఆరోపణలకే కట్టుబడి ఉన్నానని విజయసాయిరెడ్డి చెబుతున్నారు.
సుజనా చౌదరిపై మరికొన్ని ఆరోపణలు చేశారు. బోగస్ కంపెనీలు సృష్టించి బ్యాంకులకు సుజనా రుణాలు ఎగ్గొట్టారని … ఆ విషయం తనకు తెలుసన్నారు. ఎలా అంటే… గతంలో సుజనా దగ్గర ఆడిటర్‌గా పనిచేశానని విజయసాయిరెడ్డి బయటపెట్టారు. అంటే… సుజనా చౌదరి .. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టడానికి … బినామీ కంపెనీల్ని పెట్టడానికి ఆడిటర్‌గా విజయసాయిరెడ్డినే సహకరించారని ఆయనే పరోక్షంగా చెప్పినట్లయింది. అందుకే.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వ్యక్తిగతం అంటూ ఏమీ ఉండదని కవర్ చేసుకున్నారు.
తాను అవినీతి పాల్పడలేదని.. కాణిపాకంలోనే కాదు.. తిరుమలలోనూ ప్రమాణం చేస్తానని.. కన్నా,సుజనా ప్రమాణం చేయగలరా అని విజయసాయిరెడ్డి ప్రతి సవాల్ విసిరారు. విజయసాయిరెడ్డి ..కావాలనే బీజేపీ నేతల్ని రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తున్నారన్న అనుమానాలను ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఓ ప్లాన్ ప్రకారం… ఒకరి తర్వాత ఒకరిపై ఆరోపణలు చేస్తూ.. కావాలనే రచ్చ చేస్తున్నారని..దీని వెనుక రాజకీయ వ్యూహం ఉందని నమ్ముతున్నారు.