నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్రానికి రాసిన లేఖపై..ఏపీ సర్కార్ సీఐడీ విచారణ జరిపించింది. దీని ప్రకారం.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పెన్‌డ్రైవ్‌లో లెటర్ తీసుకు వచ్చారు. దాన్ని తన పీఎస్ సాంబమూర్తికి ఇచ్చారని.. ఆయన దాన్ని డెస్క్ టాప్‌లో కాపీ చేసుకుని కరెక్ట్ చేసి ఇచ్చారని తేలింది. దానిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంతకం చేసి.. తన ఫోన్ లో స్కాన్ చేసి.. కేంద్ర హోంశాఖకు పంపారు…” అని తేలింది. ఈ వాంగ్మూలం అంతా రమేష్ కుమార్ పీఎస్ సాంబమూర్తి ఇచ్చారు. ఆయన చెప్పిన దాని ప్రకారం లెటర్ ఎక్కడ మోడిఫై అయిందో… ఆ ఐపీ అడ్రస్ కూడా తెలుసుకున్నారు. ఈ వివరాలన్నింటితో సీఐడీ నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చింది. స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా ఉన్నప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్.. తనకు ప్రాణహాని ఉందని… భద్రత కావాలని చెబుతూ.. కేంద్ర హోంశాఖకు ఓ లేఖ రాశారు. ఆ లేఖ ఏపీ ప్రభుత్వానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
ఈ లేఖ టీడీపీ నుంచి వచ్చిందని.. దానిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంతకం చేయలేదని.. అసలు ఆయనకు తెలియకుండానే లేఖ వెళ్లిందని.. సంతకం కూడా టీడీపీ ఆఫీసులో పెట్టారని.. విజయసాయిరెడ్డి ఆరోపిస్తున్నారు. విచారణ జరిపించాలని డీజీపీకి లేఖ కూడా రాశారు. అప్పుడే… ధర్డ్ పార్టీ వ్యక్తులకు ఈ విషయంతో సంబంధం ఏమిటని.. తానే ఆ లేఖ రాశానని రమేష్ కుమార్ స్పష్టం చేశారు. అయినప్పటికీ..ప్రభుత్వం సీఐడీతో విచారణ చేయించింది. విచారణలో సాంబమూర్తి.. చివరికి ఆ లెటర్‌ను నిమ్మగడ్డ రమేష్ కుమారే రాసినట్లుగా చెప్పారు. దీంతో.. జగన్ కు చెందిన సాక్షి మీడియాలో భిన్నమైన ప్రచారం ప్రారంభించారు. సాక్ష్యాలన్నీ ధ్వంసం చేశారని చెప్పడం ప్రారంభించారు.
ప్రతిపక్షానికి సపోర్ట్ గా ఉండే ఏబీఎన్ లాంటి చానళ్లలో ఆ లేఖ నిమ్మగడ్డే రాశారని.. విజయసాయిరెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని రుజువైందని చెప్పడం ప్రారంభింది. అసలు లేఖ తానే రాశానని రమేష్ కుమార్ చెప్పిన తర్వాత విచారణ జరిపించడం… సాధ్యం కని విషయం. అయినా ఏపీ సర్కార్ ఏ ఏధికారంతో.. ఏ ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపించిందో తెలియదు కానీ.. సీఐడీ విచారణ జరిపించింది. ఆ నివేదిక కూడా బయటకు వచ్చింది. ఇది మరో వివాదానికి దారి తీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.