లాక్ డౌన్ వల్ల షూటింగులు ఆగిపోయాయి. సినిమాల్లేవు. హీరోలు, హీరోయిన్లు అందరికీ ఇబ్బందే. మరీ ముఖ్యంగా కథానాయికలకు. వాళ్లు రకరకాల రూపంలో ఆదాయ మార్గాల్ని కోల్పోయారు. రకుల్ ప్రీత్ సింగ్‌కి అయితే… కరోనా కష్టాలు డబుల్ అయ్యాయి. తనకి అసలే అవకాశాలు తగ్గిపోయాయి. ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలూ ఆగిపోయాయి. అంతేకాదు.. వ్యాపార పరంగానూ రకుల్ నష్టాల్లోనే ఉంది.
ఫిట్ నెస్ వ్యాపారంలోకి రకుల్ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో రెండు జిమ్‌లు ఉన్నాయి. విశాఖలో మరోటి. ఇవన్నీ బాగానే పాపులర్ అయ్యాయి. అయితే… గత 40 రోజులుగా ఈ జిమ్‌లు మూతబడ్డాయి. వాటి నిర్వహణ వ్యయం, సిబ్బంది జీతాలూ రకుల్‌నే చూసుకోవాలి. లాక్డౌన్ ఎత్తేసినా… ఇది వరకటిలా జిమ్‌లు కళకళలాడే పరిస్థితి లేదు. జన సమూహాల్ని ప్రోత్సహించే ఏ వ్యాపారానికైనా.. రానున్నది గడ్డు రోజులే. అందుకే తన జిమ్ వ్యాపారం ఏమైపోతుందో అనే బెంగ రకుల్ కి పట్టుకుంది. లాక్ డౌన్ ఎత్తేసేంత వరకూ సిబ్బందికి జీతాలు చెల్లిస్తూనే ఉండాలి. అద్దెలు, కరెంట్ బిల్లులూ కట్టుకోవాలి. ఈ భారాన్నంతా రకుల్ ఇప్పుడు మోయాల్సివస్తోంది.