ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గత ఇరవై నాలుగు గంటల్లో 80 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం ఆరు వేలకుపైగా శాంపిల్స్ పరీక్షించినట్లుగా అధికారులు ప్రకటించారు. దీంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 177కి చేరింది. ఇందులో డిశ్చార్జి అయిన వారు..మరణించిన వారు లెక్క తీస్తే.. యాక్టివ్ కేసులు 911 ఉన్నాయి. చికిత్స పొంది కోలుకుని 235 మంది డిశ్చార్జ్ అయ్యారు. 31 మంది చనిపోయారు. గత ఇరవై నాలుగు గంటల్లో నమోదైనకేసుల్లో అత్యధికంగా… కృష్ణా జిల్లాలోనివే. అంకరు ముందు రోజు 52 కేసులు నమోదవగా.. ఈ రోజు 33 కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికం విజయవాడ నగరంలోనివే.
రాజ్భవన్లో పని చేస్తున్న నలుగురు సిబ్బందికి కూడా.. కరోనా పాజిటివ్ వచ్చింది. స్పెసిఫిక్గా ఈ విషయాన్ని ప్రభుత్వం ప్రకటించలేదు. ఆ తర్వాత గుంటూరు జిల్లాలో మరో 23కేసులు నమోదయ్యాయి. నర్సరావుపేటలో ఎక్కువగా ఈ కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 13, నెల్లూరులో ఏడు..శ్రీకాకుళం జిల్లాలో మరో కేసు నమోదయింది. అత్యధికంగా టెస్టులు చేస్తున్నందు వల్లనే కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయని… అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇంకా పెద్ద ఎత్తున శాంపిల్స్ సేకరించామని.. వాటి ఫలితాలు రావాల్సి ఉందని చెబుతున్నాయి.
ప్రస్తుతం ఏపీలో రెండు వందలకుపైగా పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలు మూడు ఉన్నాయి. కర్నూలులో అత్యధికంగా 292 ఉండగా… గుంటూరు జిల్లాలో 237, కృష్ణా జిల్లాలో 210 ఉన్నాయి. విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. విశాఖలో మూడు మాత్రమే యాక్టివ్ కేసులు ఉన్నాయి.