లాక్ డౌన్ సమయాన్ని ఒకొక్కరు ఒక్కొలా వాడుకుంటున్నారు. దర్శకుడు తేజ మాత్రం తన ఫీల్డ్ కి సంబంధం లేని ఓ కోర్స్ ని మొదలుపెట్టారు. ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించిన ఓ ఆన్ లైన్ కోర్స్ లో తన పేరును నమోదు చేసుకున్నారు. ”వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్” ఈ కోర్స్ ని అందిస్తుంది. కరోనా వైరస్ వ్యాధిని స్టడీ చేయాలనే ఉత్సుకతతో ఈ కోర్స్ ని ఆయన మొదలుపెట్టారు.
కరోనా లాంటి అంటువ్యాధులు ప్రభలినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని, భవిష్యత్ లో ఇలాంటి విపత్తులకు ఎలా సిద్దంగా ఉండాలో ఈ కోర్స్ ద్వారా తెసులుకోబోతున్నారు. అంతేకాదు…వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోరితే తాను వాలంటర్ గా పనిచేయడానికి కూడా సిద్దమేనని ఆయన చెప్పారు.
సీత సినిమా తర్వాత ‘అలిమేలు మంగ వెంకట రమణ’, ‘రాక్షసరాజు రావణాసురుడు’ అనే రెండు సినిమాలు ప్రకటించారు. అంతేకాదు ఓ రెండు వెబ్ సిరిస్ లు చేయడానికి కూడా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఇంత బిజీలో కూడా ఇలాంటి ఆన్ లైన్ కోర్స్ మొదలుపెట్టడం తేజ విలక్షణమైన శైలికి అద్దం పట్టింది.