దేశంలో కరనా వైరస్ ప్రభావం, కంట్రోల్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆర్థిక వ్యవస్థను మళ్లీ పటిష్టం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ.. కొన్ని సలహాలతో.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్ది రోజుల కిందట ప్రధానికి ఓ లేఖ రాశారు. దాన్ని ప్లానింగ్ కమిషన్ స్థానంలో ఏర్పాటైన నీతి ఆయోగ్ కు కూడా పంపించారు. ఈ లేఖను చూసిన తర్వాత ఆప్పుడే ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇప్పుడు.. నీతి ఆయోగ్ చైర్మన్ నుంచి కూడా లేఖ వచ్చింది. చంద్రబాబు పంపించిన లేఖలో అంశాలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని నీతిఆయోగ్ బృందం .. చంద్రబాబును సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకుంటుందని.. రాజీవ్ కుమార్ చంద్రబాబుకు లేఖ ద్వారా తెలిపారు.
చంద్రబాబు నాయుడు కరోనా ఎఫెక్ట్ ప్రారంభమైన తర్వాత లాక్ డౌన్ పాటిస్తూ ఇంట్లోనే ఉండిపోయారు. అయితే.. ఆయన ఖాళీగా లేరు. సంక్షోభ పరిష్కారానికి మేథోమథనం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులతో మాట్లాడుతున్నారు. ఆయన కొంత మంది నిపుణులతో కలిసి గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ( జీఎఫ్ఎస్టీ ) పేరుతో.. ఓ వేదికను ఏర్పాటు చేశారు. అందరూ తమ తమ అభిప్రాయాలు చెప్పి.. కోవిడ్ -19ని ఎలా టాకిల్ చేయాలో.. సూచనలు రూపొందించారు. హాట్ స్పాట్లలో పరిస్థితిని ఎలా మెరుగుపరచాలో వివరించారు. ఈ పద్దతులపై రాజీవ్ కుమార్ ఆసక్తి కనబరిచారు. తన నీతిఆయోగ్ టీం.. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్ఫర్మేషన్ సంప్రదించి మరిన్ని విరాలు తీసుకుంటుందన్నారు.
చంద్రబాబు.. ఈ గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్ఫర్మేషన్ వేదిక కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ప్రత్యేకంగా వెబ్ సైట్ ప్రారంభించి …సవాళ్లుగా మారిన అంశాలపై పరిశోధనలు చేసి ఆలోచనలు పంచుకునేందుకు నిపుణులకు అవకాశం కల్పిస్తున్నారు. జీఎఫ్ఎస్టీ ప్రస్తుతం పూర్తిగా కరోనాను ఎలా కట్టడి చేయాలన్న అంశంపై పని చేస్తోంది. నీతి ఆయోగ్‌కు.. కావాల్సిన సమాచారం… విధాన రూపకల్పనలో ఇక ముందు పని చేసే అవకాశం ఉంది. చంద్రబాబు ఈ పని చేస్తున్నందుకు.. అధికారపక్షం తప్పు పట్టింది. ఆయన ఇంకా ముఖ్యమంత్రిగానే ఉన్నారనుకుంటున్నారని.. మండిపడింది.అయితే.. ఆలోచనలు బాగున్నాయని నీతిఆయోగ్ మాత్రం.. మొహమాటం లేకుండా.. కితాబు ఇచ్చింది.