ఆర్థిక వ్యవస్థలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. దాదాపుగా 70 శాతానికిపైగా ప్రజలకు ఉపాధి ఎంఎస్ఎంఈల వల్లే వస్తోంది. కానీ.. ప్రస్తుతం కరోనా లాక్డౌన్ వల్ల ఈ చిన్న, మధ్య తరహా పరిశ్రలన్నీ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. లాక్ డౌన్ ఎత్తివేసినా.. ఎన్ని సంస్థలు ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభిస్తాయో అంచనా వేయలేని పరిస్థితి. వారికి వర్కింగ్ క్యాపిటల్ దగ్గర్నుంచి ప్రతీది సమస్య అయ్యే ప్రమాదం ఉంది. అలాగని.. ఆ సంస్థలు ప్రారంభం కాకపోతే.. నిరుద్యోగం పెరుగుతుంది. ఈ కారణంగా జగన్మోహన్ రెడ్డి .. చిన్న పరిశ్రమలకు పెద్ద సాయం చేయాలని నిర్ణయించుకుంది. ఏపీలో 70వేలకుపైగా ఎంఎస్ఎంఈయూనిట్లు ఉన్నాయి.
ముందుగా ప్రభుత్వాలు.. వివిధ ప్రోత్సాహకాల కింద ఆయా సంస్థలకు బకాయిలుగా ఉన్న వాటిని విడుదల చేయాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసినందుకు ప్రతీ పరిశ్రమకు..ఓ విధానం ప్రకారం.. ప్రోత్సాహకాలను ప్రభుత్వం ఇస్తుంది. అయితే..ఈ ప్రోత్సాహకాలు చాలా కాలంగా నిలిచిపోయాయి. వీటిని మంజూరు చేయాలని చాలాకాలంగా పరిశ్రమలు కోరుతున్నాయి. ఇప్పుడువీటిని విడుదల చేస్తే.. ఆయా పరిశ్రమలకు ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో… పరిశ్రమలకు స్థిర విద్యుత్ చార్జీలను తీసేస్తూ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా పరిశ్రమలు.. అవి వినియోగించే విద్యుత్ ను బట్టి.. స్థిరచార్జీలను నిర్ణయిస్తారు. ఉత్పత్తి కార్యకలాపాలు నెలన్నరగా జరగడం లేదు .. అయినా ఆ చార్జీలు చెల్లించాల్సి పరిస్థితి. వీటిని ముఖ్యమంత్రి జగన్ రద్దు చేశారు.
వర్కింగ్ క్యాపిటల్ ను కూడా రుణంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఇందు కోసం రూ.200 కోట్లను కేటాయించారు. అతి తక్కువ రేటుకు రూ.2లక్షలు మొదలుకుని గరిష్టంగా రూ.10 లక్షల వరకు రుణం ఇచ్చేలా ఈ పథకాన్ని రూపొందించారు. రుణ చెల్లింపు కాలపరిమితి 3 ఏళ్లు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 30 చివరి తేదీగా నిర్ణయించారు. లాక్డౌన్ను క్రమంగా ఎత్తివేస్తూ.. జోన్ల వారీగా.. సడలింపులు ఇస్తున్న సమయంలో… ఆరెంజ్ , గ్రీన్ జోన్లలో ఎంఎస్ఎంఈలు కార్యకలాపాలు నిర్వహించడానికిఏపీ సర్కార్.. చురుగ్గా పని చేస్తోంది.