తెలుగు మీడియాను కరోనా వైరస్ పట్టుకుంది. అయితే.. తెలుగు రాష్ట్రాల్లో కాకుండా.. ఢిల్లీలో పని చేస్తున్న తెలుగు రిపోర్టర్‌కు పాజిటివ్‌గా తెలింది. ఢిల్లీలో ప్రముఖ న్యూస్ చానల్ 10టీవీకి రిపోర్టర్‌గా పని చేస్తున్న గోపీకృష్ణకు వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఆయన అనారోగ్యంతో బాధపడుతూండటంతో టెస్టులు చేశారు. ఈమేరకు పాజిటివ్‌గా తేలడంతో వెంటనే ఐసోలేషన్‌కు తరలించారు. గోపికృష్ణ కాంటాక్టులను.. ఢిల్లీ అధికారులు ఆరా తీస్తున్నారు. సహజంగా.. ఢిల్లీలో ఉండే తెలుగు మీడియా పేపర్లు, చానళ్ల ప్రతినిధులంతా కలసి ఉంటారు. ఏ కార్యక్రమమైనా కలిసే వెళ్తారు. దాంతో గోపికృష్ణ కాంటాక్టుల్లో ఢిల్లీ తెలుగు మీడియా ప్రతినిధులంతా ఉన్నారని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం గోపీకృష్ణ కుటుంబాన్ని క్వారంటైన్ లో ఉంచినట్లు తెలుస్తోంది. వారికీ టెస్టులు చేయనున్నారు. గోపికృష్ణతో సన్నిహితంగా ఉన్న మరికొంత మంది మీడియా ప్రతినిధులకూ.. వచ్చే రెండు రోజుల్లో టెస్టులు చేసే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి కూడా ఈ సెగ తగలనుంది. ఎందుకంటే… కిషన్ రెడ్డి ఢిల్లీలో ఏర్పాటు చేసిన కమాండ్ సెంటర్ బాధ్యతలు చూసుకుంటున్నారు. రోజూ మీడియాతో ఇంటరియాక్ట్ అవుతున్నారు.
టెన్ టీవీ ప్రతినిధిగా గోపీకృష్ణకు దాదాపుగా మూడు సార్లు ఇంటర్యూ ఇచ్చినట్లగా తెలుస్తోంది. దీంతో కిషన్ రెడ్డి కూడా హోంక్వారంటైన్ కు వెళ్లే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఢిల్లీలో కరోనా ఉద్ధృతంగా వ్యాపిస్తోంది. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న వైద్యులు, వైద్య సిబ్బంది పోలీసులు.. రక్షణ దళ సిబ్బందికే కాదు.. తాజాగా మీడియాకు కూడా.. పాకింది.