నయనతార నడిపిన ప్రేమకథలు మామూలువి కావు. ఓ సంచనలం. సెలబ్రెటీ ప్రేమకథల్లో అదో అధ్యాయం. శింబుతో నడిపిన లవ్ స్టోరీని సినీ అభిమానులు ఇప్పటికీ మర్చిపోరు. వారిద్దరి మధ్య పుట్టిన గాసిప్పులన్నీ కలిపి ఓ రొమాంటిక్ లవ్ స్టోరీనే తీసేయొచ్చు. ఆ ప్రేమకథ కంచికి చేరకుండానే యూ టర్న్ తీసుకుంది. ఆ తరవాత ప్రభుదేవాతో నడిపిన ప్రేమాయనం కూడా తక్కువేం కాదు. తమిళనాట అదో హాట్ టాపిక్ గా నడిచింది. ప్రభుదేవా కాపురంలో కలహాలు పుట్టించింది. దానికీ పుల్ స్టాప్ పడిపోయింది.
ఆ తరవాత.. నయన ఖాళీగా ఏం లేదు. దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో ముచ్చటగా మూడో లవ్ స్టోరీ మొదలెట్టింది. వీరిద్దరి బంధం.. పెళ్లి వరకూ వెళ్లింది. ఇద్దరికీ పెళ్లయిపోయిందని సోషల్ మీడియాలో చాలాసార్లు పుకార్లు పుట్టుకొచ్చాయి. ఫొటోలు బయటకు వచ్చాయి. ఇద్దరూ సహజీవనం కూడా చేశారు. ఇప్పుడు ఈ మూడో ప్రేమకథ కూడా ముక్కలైపోయిందని తమిళనాట వార్తలు పుట్టుకొస్తున్నాయి. కొంతకాలంగా నయన్ – విఘ్నేశ్ ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నార్ట. ఇక కలిసి ఉండలేమని, ఎవరి జీవితాలు వాళ్లే చూసుకోవాలని – ఓ నిర్ణయానికి వచ్చేసినట్టు టాక్. తమిళనాట ఛానళ్లలో, పేపర్లలో ఇదే వార్త హల్ చల్ చేస్తోంది. అయితే అటు నయన్ గానీ, ఇటు విఘ్నేశ్ గానీ ఏమాత్రం స్పందించడం లేదు. వాళ్లు కామ్ గా ఉన్నారంటే.. ఇది నిజమే అని గాసిప్పు రాయుళ్లు కూడా రెచ్చిపోయి మరీ వార్తలు వండేస్తున్నారు. మరి.. నిజానిజాలేమిటో వారిద్దరికే తెలియాలి. ఈ ప్రేమకథ బ్రేకప్ అయినా.. ఎవరూ ఆశ్చర్యపోరు కూడా. ఎందుకంటే.. నయన్కీ, తన అభిమానులకూ ఇది అలవాటైన విషయమే.