మెహర్ రమేష్ తో ఓ సినిమా చేస్తానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు చిరంజీవి. చిత్రసీమలో ఎప్పుడైనా, ఏదైనా సాధ్యమే కాబట్టి – మెహర్ రమేష్తో చిరు ఓ సినిమా చేసినా చేసేయగలడు. పైగా చిరు కాంపౌండ్లో మెహర్ రమేష్ ఇప్పుడు కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ముఖ్యంగా సీసీసీ కార్యకలాపాలన్నీ మెహర్ నే చూసుకుంటున్నాడు. దాంతో చిరు – మెహర్ రమేష్ ల మధ్య ఎమోషన్ బాండింగ్ ఏర్పడింది. అందుకే సినిమా ఛాన్సిచ్చాడు.
అయితే… మెహర్ తో సినిమా అనేది ఎప్పటికైనారిస్కే అనే సంగతి చిరుకీ తెలుసు. సినిమా మొదలవ్వకముందే… ఈ కాంబోపై నెగిటీవ్ ప్రచారం ఊపందుకుంటుంది. అందుకే ముందు జాగ్రత్తగా మెహర్ రమేష్ చేతికి ఓ రీమేక్ సబ్జెక్ట్ అప్పగించినట్టు తెలుస్తోంది. రీమేక్ అయితే రిస్కు తక్కువ. పైగా దర్శకుడు చేసేదేం ఉండదు. ఉన్నది ఉన్నట్టు తీయగలిగినా.. సేఫ్ ప్రాజెక్టు అవుతుంది. చిన్న చిన్న మార్పులన్నవి ఎప్పుడూ ఉండేవే. అందుకే మెహర్ తో చిరు రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యాడని టాక్. చిరు చేతిలో ఉన్న రీమేక్ `లూసీఫర్`. అది సుజిత్కి అప్పగించాడు. పవన్ కల్యాణ్ చేద్దామనుకున్న `వేదాళం` ఇప్పుడు చిరు చేతికి వెళ్లిందని, దాన్నే మెహర్ తో చేద్దామనుకుంటున్నాడని ఓ టాక్ వినిపిస్తోంది. వేదాళం మాటెలా ఉన్నా, మెహర్ రమేష్ తో రీమేక్ కథ పట్టాలెక్కడం ఖాయం. అది వేదాళమా? మరోటా అనేది కాలమే చెప్పాలి.