ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాలు ప్రారంభించారు. పెద్ద ఎత్తున మందుబాబులు గుమికూడారు. కొనుగోలు చేశాురు . తాగారు. అంత వరకూబాగానే ఉన్నా.. అసలు అమ్మిన బ్రాండ్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సాధారణంగా మద్యం తాగే వారు కొన్ని బ్రాండ్లకు పరిమితం అవుతుంది. అందుకే… సిట్టింగ్ సందర్భంలో “నీదే బ్రాండ్.. నీదే బ్రాండ్..” అనే వివరాల సేకరణ ఎక్కవగా జరుగుతూ ఉంటుంది. అందరూ.. రాయల్ స్టార్ అనో.. బ్లెండర్స్ ప్రైడ్ అనో.. ఆఫీసర్స్ చాయిస్ అనో.. కింగ్ ఫిషర్ లైట్ అనో… సినిమాల్లోనో..బయటో విరివిగా వినిపించే పేర్లు చెబుతూ ఉంటారు. వాటికే ఎక్కువ డిమాండ్ ఉంటుంది కూడా. కానీ ఆంధ్రలో మాత్రం.. అలాంటి మద్యమేం దొరదు. ఏపీ స్పెషల్ బ్రాండ్లు వేరే.
మందు బాబుల చేతుల్లోకి ఎప్పుడూ చూడని బ్రాండ్లు ..!
స్పై హెచ్ డీ బ్రాందీ. యంగ్ స్టార్ విస్కీ, బ్లాక్ బస్టర్ బీర్, విక్టోరియా, గెలాక్సీ.. ఇలాంటి పేర్లతో ఉన్న బ్రాండ్లను మాత్రమే అమ్ముతూంటారు. చూసేందుకే డూప్లికేట్ ప్యాకింగ్లా ఉండే మందునే విచ్చలవిడిగా అక్కడి మందు బాబులు కొనుగోలు చేసి తాగేస్తున్నారు. అసలు ప్రముఖ మద్యం బ్రాండ్లు ఎందుకు అమ్మరు..? బలవంతంగా వీటినే తాగేలా మందుబాబుల్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారనేది.. ఓ మిస్టరీనే. నిన్న అమ్మకాలు ప్రారంభించిన తర్వాత సోషల్ మీడియాలో ఈ బ్రాండ్లు ఒక్క సారిగా హైలెట్ అయ్యాయి. అనేక రకాల సెటైర్లు వేశారు. కొంత మంది ఆ బ్రాండ్లు తయారు చేసి ఉత్పత్తి కంపెనీల గుట్టును బయటకు తీసే ప్రయత్నం చేశారు.
నిన్నటిదాకా శానిటైజర్లు.. ఇప్పుడు మద్యం ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు..!
ఏపీలో తొలి రోజు అమ్మిన మద్యం బ్రాండ్ల తయారీ దారుల వివరాలు బయటకు తీస్తే.. కొన్ని సంచలనాత్మకమైన విషయాలు బయటకు వచ్చాయి. లాక్ డౌన్ సమయంలో శానిటైజర్లు తయారు చేసి.. ప్రభుత్వానికి అమ్మిన కంపెనీలు.. రాత్రికి రాత్రే మద్యాన్ని తయారు చేసి… షాపులకు సరఫరా చేశాయి. స్పై హెచ్డీ అనే బ్రాండ్ ను అమ్మిన డిస్టిలరీ.. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున శానిటైజర్ ను సరఫరా చేసింది. ఇతర బ్రాండ్లను.. ఉత్పత్తి చేసిన కంపెనీలు కూడా అదే బాపతు. ఇవన్నీ ఊరూపేరూ లేని కంపెనీలు. బడా బ్రాండ్లు తయారు చేసే డిస్టిలరీ.. ఒకటి ఉంది కానీ.. ఆ డిస్టిలరీ ద్వారా బ్రాండ్లను ఉత్పత్తి చేయడం లేదు. కొత్త మందు ఏదో ఉత్పత్తి చేసి మార్కెట్లోకి తీసుకు వచ్చారు.
ఒకటి, రెండు తప్ప అన్నీ ఒకే సామాజికవర్గం వారివి.. !
ప్రస్తుతానికి ప్రభుత్వ మద్యం దుకాణాలకు మద్యం సరఫరా చేస్తున్న డిస్టిలరీల్లో అత్యధికం…. ఒకటి రెండు మినహా… అన్నీ ఒకే సామాజికవర్గం వారికి చెందినవి. చాలా డిస్టిలరీలు ఎప్పుడు ప్రారంభించారో కూడా పూర్తిగా తెలియదు. మద్యం ఉత్పత్తి అంటే.. చాలా సులువు అన్నట్లుగా.. వీరి ఉత్పత్తి కార్యకలాపాలు సాగుతున్నాయి. వీరు ఉత్పత్తి చేసే బ్రాండ్లు మరే రాష్ట్రంలోనూ అమ్మరు. అమ్మరు అనే దాని కన్నా.. ఎవరూ కొనరు కాబట్టి.. అక్కడకు పంపరు అనుకోవాలేమో..? అన్ని రాష్ట్రాల్లో డిమాండ్ కు తగ్గట్లుగా బ్రాండ్లు అమ్ముతూంటారు. కానీ ఏపీలో మాత్రం.. ప్రభుత్వం అమ్మినవి మాత్రమే తాగాలి.