కరోనా మీడియా రంగంలోనూ కలకలం రేపింది. చాలామట్టుకు ఉద్యోగాలు పోయాయి. ప్రతీ సంస్థ జీతాల్ని కట్ చేసింది. 20 నుంచి 40 శాతం వరకూ జీతాల్ని జర్నలిస్టులు నష్టపోయారు. `సంస్థలో ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించొద్దు.. జీతాలు ఆపొద్దు` అని ప్రభుత్వం ఇది వరకే యాజమాన్యాల్ని కోరింది. ఆ వార్తల్ని రాసిన, ప్రసారం చేసిన మీడియా సంస్థ లు మాత్రం – తమ ఉద్యోగులపై ఆ మాత్రం కనికరం చూపించలేకపోయాయి.
మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ లో భాగంగా కొంతమంది పాత్రికేయులు జీతాల కోత విషయాన్ని కేసీఆర్ ముందు తీసుకెళ్లారు. `మా జీతాలు కట్ చేశారంటూ` ఆవేదన వ్యక్తం చేశారు. పాత్రికేయుల జీతాల్ని కత్తిరించడం దారుణమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కేసీఆర్. ఈ విషయంపై సమగ్రమైన సమాచారం అందించమని, తానువ్యక్తిగతంగా ఆయా సంస్థలతో మాట్లాడతానని పాత్రికేయులకు హామీ ఇచ్చారు. విషయమేమిటంటే.. కేసీఆర్ సొంత పత్రిక లాంటి నమస్తే తెలంగాణలోనూజీతాలు కట్ అయ్యాయి. ఆ విషయం కేసీఆర్ కు తెలుసో.. లేదో?