వెటరన్ హీరోయిన్ భూమిక తెలుగులో అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. ఎంసీఏలో నాని వదినగా నటించిన భూమిక, రూలర్ లో ఓ కీలకమైన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. రెండు సినిమాలూ ఆమె కెరీర్‌కి ఏ కోణంలోనూ ఉపయోగపడలేదు. అయితే ఈమధ్య `బోల్డ్ పాత్రలకు రెడీ` అంటూ ఓ విచిత్రమైన స్టేట్ మెంట్ ఇచ్చింది. భూమికని బోల్డ్ పాత్రల్లో చూపించే సాహసం దర్శకులు, చూపించినా చూసే ధైర్యం ప్రేక్షకులు చేయలేరు. భూమిక మాత్రం `వయసుతో పనేముంది? ఆంధాధూన్లో టబు ఆ తరహా పాత్రలు చేయలేదంటి?` అని లాజిక్కులు తీస్తోంది.
బహుశా.. అంధాధూన్ రీమేక్ లో తనకు అవకాశం వస్తోందేమో అని భూమిక ఓ రాయి వేసి ఉంటుంది. అంధాధూన్ ని నితిన్‌తో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీ వెర్షన్ లో టబు చేసిన పాత్ర కోసం తగిన నటిని వెదుకుతున్నారు. ఆ ఛాన్స్ తనకొస్తే బాగుంటుందని భూమిక ఆశిస్తోందేమో.? అయితే చిత్రబృందం ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు ఫామ్ లో ఉన్న ఓ పెద్ద హీరోయిన్ తోనే ఆ పాత్ర చేయించాలని భావిస్తున్నార్ట. అలాగైతే.. భూమిక ఇచ్చిన స్టేట్మెంట్ వేస్టయిపోయినట్టే.