ఆంధ్రప్రదేశ్ సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న పీవీ రమేష్ … కీలక సమయాల్లో టాస్క్ మాస్టర్‌గా వ్యవహరిస్తూ.. ప్రభుత్వ నిర్ణయాలు సాఫీగా అమలు జరిగేలా చూడటంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. దేశంలో కరోనా ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఆయన నిర్విరామంగా ప్రయత్నిస్తున్నారు. స్వయంగా ఆయన వైద్యుడు. ఐఏఎస్‌గా ఆయన సర్వీసులో మంచి పేరు తెచ్చుకునేలా.. కేంద్ర, రాష్ట్రాల్లో పని చేశారు. వైఎస్ హయాంలో.. నిమ్స్ బాధ్యతలూ చూసుకున్నారు. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న ఐఏఎస్‌ను.. జగన్ తాను సీఎం కాగానే.. ఏపీకి తెచ్చుకున్నారు. తన పేషీలోనే కీలక బాధ్యతల్ని అప్పగించారు. జగన్ నమ్మకాన్ని పీవీ రమేష్ వమ్ము చేయడం లేదు.
కరోనా విషయంలో ఏపీ సర్కార్ తీసుకుంటున్న చర్యలన్నింటి వెనుక.. పీవీ రమేష్ ఆలోచనలు ఉన్నాయి. రాపిడ్ టెస్టింగ్ కిట్స్… ట్రూనాట్ వంటి వాటితో శరవేగంగా టెస్టులు చేస్తే… కరోనా కేసులన్నీ బయటపడతాయని.. అలా చేస్తే… కరోనాను కంట్రోల్ చేయడం చాలా ఈజీ అవుతుందని.. ప్రభుత్వ పెద్దలను ఒప్పించగలిగారు పీవీ రమేష్. దానికి తగ్గట్లుగానే ఇప్పుడు.. దేశంలోనే అత్యధిక టెస్టులు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ముందు ఉంది. దేశంలోనే పాజిటివిటీ రేటు అతి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉంది. స్వతహాగా వైద్యుడు కావడంతో కరోనాను డీల్ చేయడంలో.. ఏపీ సర్కార్ వార్ ఫోర్స్‌కు ప్రధాన పిల్లర్‌లా పనిచేస్తున్నారు.
విశాఖ గ్యాస్ ట్రాజెడీ విషయంలోనూ పీవీ రమేష్ చురుగ్గా స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని.. చెబుతున్నారు. విషయం తెలిసిన వెంటనే… ఆ చుట్టుపక్కల వారందర్నీ… తరలించడానికి ఆయన ప్రత్యేకమైన చొరవ తీసుకున్నారు. ప్రభుత్వ విధానాన్ని ఆయన సమర్థంగా అమలు చేయడానికి తన సర్వశక్తులు ఒడ్డుతారు. కేంద్రంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ.. ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఎంఏ సహాయ కార్యక్రమాలు స్మూత్‌గా సాగిపోయేలా ప్రభుత్వం తరపున కోఆర్డనేట్ చేసుకోవడంలో పీవీ రమేష్ ..సక్సెస్ అయ్యారు. పీవీ రమేష్ ప్రతిభపై నమ్మకం ఉండబట్టే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఆయన రిటైరైనా.. ప్రత్యేకంగా పదవి సృష్టించి.. తన పేషీలోనే కీలక బాధ్యతల్లో ఉంచుకున్నారు. ఆ నమ్మకాన్ని.. వమ్ము కానీయడం లేదు పీవీ రమేష్.