విశాఖ గ్యాస్ ప్రమాదానికి ఓ కోణం అయితే..మహారాష్ట్రలో రైలుకు బలైపోయిన వలస కూలీల ఘోరం .. స్వతంత్ర భారతంలో మరో వేదనా పూరిత అధ్యాయం. రెండూ మానన తప్పిదాలే. తప్పు ఎవరు చేసినా.. బలైపోయింది మాత్రం.. సామాన్యులే. లాక్ డౌన్ తర్వాత సొంత ఊళ్లకు వెళ్లేందుకు వందల కిలోమీటర్లు నడుచుకుంటూ పోతున్న కూలీల వ్యధలు ప్రభుత్వానికి పట్టలేదు. ఇలా రైలు పట్టాల వెంబడి నడుచుకుంటూ పోతున్న కూలీల పాలిట గూడ్స్ రైలు మృత్యువుగా మారింది. మహారాష్ట్రలోని ఔరంగబాద్‌లో .. నడుచుకుంటూ పోతూ.. అలసటకు గురై.. ట్రాక్‌పై పండుకున్న వారికి.. అదే చివరి రాత్రి అయింది. ట్రాక్‌పై నిద్రిస్తున్న వలస కూలీలపై గూడ్స్ రైలు దూసుకెళ్లింది. ఘటనలో పదహారు మంతి శరీరాలు ఛిద్రమయ్యాయి.
మృతుల్లో, ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. మృతులంతా మధ్యప్రదేశ్‌కు నడుచుకుంటూ వెళ్తున్న కూలీలు. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లడం కన్నా పట్టాలను దారిగా చేసుకుని వీరంతా నడుచుకుంటూ వెళ్తున్నారు. లాక్డౌన్ కారణంగా రైళ్లేమీ తిరగడం లేదన్న ఉద్దేశంతో.. వీరు.. పట్టాలపైనే రోజూ పండుకుంటున్నారు. కానీ వారికి కాలం కలసి రాలేదు.. గూడ్సు రైళ్లకు పర్మిషన్ ఉండటంతో… ఆ ట్రాప్‌పై ఆ రైలు వచ్చింది. పెద్ద ఎత్తున వలస కార్మికులు గాయపడ్డారు. వలస కూలీల దయనీయ పరిస్థితికి ఈ ఘటన అద్దం పట్టింది. కేంద్రం లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత వలస కూలీలు ఎక్కడి ఎక్కడివారక్కడే ఉండిపోయారు. లాక్ డౌన్ పొడిగింపు.. అంతకంతకూ పెరుగుతూండటంతో.. అందరూ.. తమ సొంత గ్రామాలకు వెళ్లిపోవాలనుకున్నారు.
ప్రభుత్వాలు.. వలస కూలీల్ని సొంత గ్రామాలకు తరలించడానికి ఇష్టపడలేదు. దాంతో కాలి నడకనే లక్షల మంది బయలుదేరారు. అనేక మంది రోడ్లుపై వెళ్తూ నడుస్తూనే చనిపోయినఘటనలు వెలుగు చూశాయి. బిడ్డలు, గర్భిణులు పడుతున్న అవస్థలు కూడా వెలుగు చూశాయి. కానీ ప్రభుత్వాలు తీరిగ్గా.. ప్రత్యేక శ్రామిక్ రైళ్లను ప్రకటించాయి. వాటిలో ఎలా వెళ్లాలో తెలియని కూలీలే ఎక్కువ. అందుకే ఎక్కువ మంది కాలి నడకను ఎంచుకున్నారు. ఇలా బలైపోతున్నారు. ఘటన జరిగిన తర్వాత ప్రధాని సహా అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.కానీ ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందో.. వారి కోసం ఏం చేయాలో… కనీస ప్రకటన రాలేదు.