కరోనా వల్ల పేదలు చాలా అవస్థ పడుతున్నారు. చాలామందికి తినడానికి తింటి లేదు. ఇలాంటి సమయంలో దాతలు పెద్ద మనసు చూపిస్తున్నారు. తమకు తోచినంత సహాయం చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా వాళ్లు. ఆహార పంపిణీ విషయంలో అందరికంటే సినిమావాళ్లే ముందున్నారు. అవసరార్థుల్ని గుర్తించి వాళ్ల కడుపు నింపుతున్నారు.
అయితే.. ఇస్తే రేషన్ ఇవ్వండి కానీ అలాంటి వాళ్లకు డబ్బులు ఇవ్వకండి – అంటోంది రష్మిక. బుల్లి తెరపై హాట్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది రష్మి. కొన్ని సినిమాలూ చేసింది. రష్మికు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి రష్మిక `ఎవ్వరికీ డబ్బులు ఇవ్వొద్దు` అనడం ఆసక్తిని రేకెత్తించేదే. అవసరార్థులకు రేషన్ ఇవ్వండి, డబ్బులొద్దు, ఎందుకంటే డబ్బులిస్తే తాగేస్తారు అంటూ ట్విట్టర్లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పింది. రష్మిక చెప్పిన పాయింట్ లో నిజం ఉంది. ఈమధ్యే లిక్కర్ అమ్మకాలకు గేట్లు తెరిచాయి తెలుగు ప్రభుత్వాలు. ఇలా బ్రాందీ షాపులు తెరవడం పాపం.. అలా క్యూలు కట్టేశారు. ధరలు పెంచినా సరే… కొనుక్కుపోయారు. పించను డబ్బుల్ని ముసలివాళ్లు మందు సీసాల కోసం ఖర్చు పెట్టడం చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వం ఒకందుకు డబ్బులిస్తే – దాన్ని మరోకందుకు వాడుకుంటున్నారు. అందుకే.. రష్మి `డబ్బులివ్వొద్దు` అంటోంది.