ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరో సారి ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అవుతున్నారు. సోమవార మధ్యాహ్నం మూడు గంటలకు ఈ వీడియో కాన్ఫరెన్స్ భేటీ జరుగుతుంది. పదిహేడో తేదీన.. కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ పదిహేడో తేదీతో ముగుస్తుంది. చాలా రాష్ట్రాలు.. కేంద్ర మార్గదర్శకాలను పాటిస్తున్నాయి. ఈ క్రమంలో పదిహేడో తేదీ తర్వాత ఏం చేయాలన్న దానిపై మోడీ.. ముఖ్యమంత్రుల అభిప్రాయాలను తెలుసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే.. లాక్ డౌన్ పొడిగిస్తున్నప్పటికీ.. వరుసగా మినహాయింపులు ఇస్తూ వస్తున్నారు.
ఒక వేళ సాంకేతికంగా లాక్ డౌన్ పొడిగింపును మళ్లీ ప్రకటించినప్పటికీ.. పరిమితంగా… పబ్లిక్ ట్రాన్స్ పోర్టుకి.. సినిమా ధియేటర్లకు మాల్స్‌కు పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. కొన్ని రాష్ట్రాలు.. కేంద్రం ప్రకటించిన మినహాయింపులు కూడా ఇవ్వడం లేదు. కొన్ని రాష్ట్రాలు మినహాయింపులు పూర్తిగా ఇస్తున్నాయి. ఇప్పటికే రెండు నెలల లాక్ డౌన్ అయినందున.. ఇక ముందు కొనసాగిస్తే.. ప్రజలు సహకరించే పరిస్థితి ఉండదన్న అభిప్రాయం అన్ని వర్గాల్లోనూ ఉంది.
అందుకే.. భౌతిక దూరం, మాస్కులు తప్పని సరి చేసి.. సాధారణ జన జీవనానికి అంగీకరిస్తారని.. దీనిపై ముఖ్యమంత్రుల అభిప్రాయాలను మోడీ తెలుసుకుంటారని చెబుతున్నారు. ముఖ్యమంత్రులు కూడా.. కంటైన్మెంట్ జోన్లకు మాత్రమే… కట్టడి పరిమితం చేసి.. మిగతా చోట్ల లాక్ డౌన్ ఎత్తివేయాలని కోరుతున్నారు. ముఖ్యమంత్రులతో చర్చించిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ..తుది నిర్ణయం తీసుకోనున్నారు. జాతినుద్దేశించి ప్రసంగించి అధికారికంగా కేంద్ర నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది.