నయనతార తన పిల్లలకు కాబోయే తల్లి అంటూ..విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. నయన్ మూడో లవ్ స్టోరీ కూడా.. సుఖాంతం అయ్యేదశలో బ్రేకప్ అయిందని.. కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. నయనతార, విఘ్నేష్ శివన్ ఎడమెహం, పెడమొహంగా ఉంటున్నారని.. పెళ్లి చేసుకోవాలని విఘ్నేష్ తొంతర పెడుతూంటే..నయన్ సుముఖంగా లేదని… అందుకే అభిప్రాయబేధాలొచ్చాయని కోలీవుడ్‌లో చెప్పుకుంటున్నారు. అయితే..సహజంగా ఇలాంటి ప్రచారాలకు…నయనతార స్పందించరు.
ఆ మాటకొస్తే.. తన పర్సనల్ లైఫ్ పై ఎవరేముకున్నా ఆమె డోంట్ కేర్. అనూహ్యంగా విఘ్నేష్ శివన్ మాత్రం.. మదర్స్ డే సందర్భంగా.. అలాంటిదేం లేదని చెప్పేందుకు సోషల్ మీడియాను వేదికగా ఉపయోగించుకున్నారు. తన పిల్లలకు కాబోయే తల్లిగా ప్రకటించేసి.. కాస్త ముందుకెళ్లిపోయారు. అదే సమయంలో.. నయనతార తల్లికీ కూడా కృతజ్ఞతలు చెప్పారు. నయనతార మొదట శింబుతోనూ.. తర్వాత ప్రభుదేవాతోనూ… ప్రేమలో పడింది. రెండు ప్రేమ కథలూ పెళ్లి వరకూ వెళ్లాయి. చివరికి తెగిపోయాయి. ఆ తర్వాత విఘ్నేష్ శివన్ వంతు వచ్చింది.
తమిళంలో ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న విఘ్నేష్.. నయనతారతో ప్రేమను ఆస్వాదించడానికే ఎక్కువ సమయం కేటాయించడంతో…కెరీర్లో మరీ దూసుకెళ్లలేకపోయారు.కానీ తీసిన సినిమాలు మాత్రం మంచి సక్సెస్ అయ్యాయి. ఏ ప్రేమ కోసం తన కెరీర్ ను కాస్త నిర్లక్ష్యం చేశారో.. ఇప్పుడు ఆ ప్రేమ కూడా దక్కుతుందో లేదోనన్న టెన్షన్‌తో.. ఇలా ముందస్తుగా సోషల్ మీడియాలో విఘ్నేష్ ప్రకటనలు చేస్తున్నారన్న అభిప్రాయం కోలీవుడ్ లో వినిపిస్తోంది. మరి నయన్ రిప్లయ్ ఇస్తుందో లేదో..?