హైదరాబాద్: సియాచిన్ మంచుకొండలలో ఆరురోజులపాటు మంచులో కూరుకుపోయి బయటపడిన సైనికుడు హనుమంతప్ప ఇవాళ మృత్యువుతో పోరాడుతూ ప్రాణాలు విడిచారు. ఆరు రోజులపాటు మంచులో కూరుకుపోయి ఉండటంతో ఆయన ఆరోగ్యం దెబ్బతినింది. న్యూమోనియా వ్యాధి సోకటంతోపాటు, లివర్, కిడ్నీలు దెబ్బతిన్నాయి. బయటకు తీసినవెంటనే హుటాహుటిన ఢిల్లీ ఆర్మీ ఆసుపత్రికి తరలించి మూడురోజులుగా చికిత్స అందిస్తున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడి దగ్గరనుంచి దేశవ్యాప్తంగా అందరూ హనుమంతప్ప కోలుకోవాలని ఆకాంక్షించారు. మోడి ఆర్మీ ఆసుపత్రికి వెళ్ళి అతనిని చూసివచ్చారు. హనుమంతప్ప కర్ణాటకకు చెందినవారు.