ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు.. ధనిక దేశాలైన అమెరికా, జపాన్లతో పోటీగా.. ప్యాకేజీ ప్రకటించారు. రూ. 20 లక్షల కోట్లతో భారత ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిన పెట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ గొప్ప సంకల్పాన్ని ప్రకటించారు. ఇప్పుడు ఆ ఇరవైలక్షల కోట్లను.. ప్రాధాన్యతా రంగాలకు కేటాయిస్తారు. మోదీ ప్రసంగాన్ని బట్టి చూస్తే స్వావలంబన ప్రధానాంశంగా తీసుకున్నారు కాబట్టి… తయారీ రంగానికి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది.
ప్యాకేజీలో ప్రతీ ఒక్కరికీ సాయం..!
ప్రపంచంలోని అనేక దేశాలు… తమ తమదేశాల ఆర్థిక వ్యవస్థలను చక్కదిద్దుకునేందుకు ప్యాకేజీలు ప్రకటించాయి. అమెరికాలో ఇప్పటికే 2 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీ ప్రకటించిన ట్రంప్ … దశల వారీగా మరో 2 ట్రిలియన్ పంప్ అప్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్యాకేజీలో అన్ని వ్యాపార రంగాలకు సాయం ప్రకటించారు. అలాగే ప్రజలకు వ్యక్తిగతంగా సాయం చేశారు. ఒక్కొక్కరికి భారత కరెన్సీలో 90వేల రూపాయలు అందేలా ప్యాకేజీ ప్రకటించారు. జపాన్ కూడా.. రెండు విడుతలుగా అమెరికా స్థాయిలోనే ప్యాకేజీ ప్రకటించింది. ఇందులోనూ వ్యాపార, పారిశ్రామిక రంగాలతో పాటు.. ప్రజలకు నగదు బదిలీ కూడా ఉంది.
స్థానిక తయారీ ప్రోత్సాహించే దిశగా అడుగులు..!
అయితే.. జపాన్, అమెరికాల జీడీపీ ఎక్కువ. వారి కరెన్సీకి ప్రపంచవ్యాప్తంగా చెల్లుబాటు ఉంటుంది. కానీ.. భారత్ కరెన్సీకి మాత్రం అంత వెసులుబాటు లేదు. వారు నగదు ముద్రించుకుని ఆర్థిక వ్యవస్థలో కదలిక తీసుకు రావచ్చు. భారత్ కూడా అదే తరహాలో నగదు ముద్రణ మోడల్ ని ఎంచుకునే ఛాన్స్ ఉంటుందా లేక వనరుల్ని సమీకరించుకుని ప్యాకేజీ ప్రకటిస్తుందా..అన్నది ఆసక్తికరంగా మారింది. ఆర్థిక వ్యవస్థను పట్టించుకోకుండా… ఇష్టం వచ్చినట్లుగా నోట్లను ముద్రించి పంపిణి చేస్తే… ద్రవ్యోల్బణం పెరగడం తప్ప ప్రయోజనం ఉండదు. ఉత్పత్తి పెరగాలి. ప్రధానమంత్రి కూడా.. అదే చెప్పారు. ఉత్పత్తి పెంచి..గ్లోబల్ సప్లై చైన్లో ప్రముఖంగా నిలబడాలని అన్నారు. అంటే.. ఉత్పాదకరంగానికి ఆయనఎక్కువ ప్రోత్సాహం ఇస్తారని అనుకోవచ్చు.
ప్యాకేజీ ప్రకటన కంటే సమర్థంగా అమలు చేయడమే కష్టం..!
జీడీపీలో పదిశాతం మేర కొత్తగా నగదు ముద్రణకు స్కోప్ ఉంది. అదే జరిగితే ఎకానమీలో లిక్విడిటీ పెరిగి జీవం వచ్చినట్టేనన్న అభిప్రాయం నిపుణుల్లో ఉంది.- ఇస్తానన్న 20 లక్షల కోట్లు దశల వారీగా కాబట్టి… ప్రాధాన్య రంగాలు పెట్టుకోవచ్చు. లాక్ డౌన్ నుంచి బయట పడేందుకు మోదీ రెడీ చేసిన జంబో ప్లాన్ ఇండియన్ ఎకానమీ రూపు రేఖలు మార్చుతాయని అంచనా వేస్తున్నారు. ఆర్థిక కలాకలాపాలు గతంలో మాదిరిగి జరుగుతూ ఉంటే.. దేశం పట్టాలెక్కినట్టే భావించవచ్చు. ప్రపంచంలో ప్రస్తుతం ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ తల్చుకుంటే నిజానికి ఇంతటి ప్యాకేజీ ఇవ్వడం సాధ్యమే. కానీ దాన్ని ఉపయోగపడేలా అమల్లోకి తేవడమే కష్టం.