వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు నిన్న రాత్రి వీరంగం సృష్టించారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించి , బారికేడ్లను పగలగొట్టి తమ బస్సును తీసుకెళ్లిపోయారు.. వివరాల్లోకి వెళితే..
ఈ సంఘటన నిన్న రాత్రి ఆంధ్ర ఒడిశా సరిహద్దు వద్ద జరిగింది. ఒడిశా లో పెళ్లికి వెళ్లి అక్కడ నుండి తిరిగి వస్తున్న పెళ్లి బస్సు ని మెలియాపుట్టి మండలం పట్టుపురం వద్ద పోలీసులు ఆపారు. మందస కు చెందిన ఈ పెళ్లి బస్సు కు సరైన అనుమతులు లేకపోవడంతో పోలీసులు బస్సు ఆపారు. అయితే ఇంతలో రంగంలోకి దిగిన ఎమ్మెల్యే అప్పలరాజు, తమ వారికి చెందిన బస్సును ఆపుతారా అంటూ పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు వద్ద ఉన్న చెక్ పోస్ట్ బారికేడ్లను పగలగొట్టి బస్సును తీసుకెళ్లిపోయారు.
ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే కు చెందిన సంఘటన కావడంతోనో, మరింకే కారణంతోనో గానీ, చాలావరకు అగ్ర చానల్స్ అన్ని ఈ వార్తని పక్కన పెట్టేసినట్లు గా కనిపిస్తోంది.