సమంత, కీర్తి సురేష్‌లు వచ్చాక… నిత్యామీనన్ లాంటి వాళ్లు సైడ్ అయిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. లవ్ స్టోరీలకు, లేడీ ఓరియెంటెడ్ కథలకూ న్యాయం చేసిన నిత్య… ఆ తరవాత ఈ పోటీని తట్టుకోలేక పక్కకు వెళ్లిపోయింది. తన ఆటిట్యూడ్ వల్ల కొన్ని సినిమాల్ని వదులుకుంది. బొద్దుగా తయారవడం వల్ల కొన్ని సినిమాలు దూరమయ్యాయి. ఇప్పుడు నిత్యని అంతా మర్చిపోయారు.
అయితే ఎట్టకేలకు నిత్యమీనన్ తెలుగులో ఓ అవకాశాన్ని చేజిక్కించుకుంది. త్వరలోనే ఓ పొలిటికల్ థ్రిల్లర్‌లో నిత్య కనిపించబోతోంది. హాలీవుడ్లో కొన్ని చిత్రాలకు పని చేసిన ఓ యువ దర్శకుడు ఈ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దాదాపుగా స్క్రిప్టు పూర్తయినట్టే. లాక్ డౌన్ ఎత్తేశాక షూటింగ్ మొదలెడతారు. త్వరలోనే ఓ అధికారిక ప్రకటన బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈచిత్రాన్ని దక్షిణాది భాషలతో పాటు, హిందీలోనూ విడుదల చేయాలని భావిస్తున్నారు.