రాంగోపాల్ వర్మ సడన్‌గా `క్లైమాక్స్` చూపించేశాడు. ఈ సినిమా ఎప్పుడు మొదలెట్టాడో, ఎప్పుడు పూర్తి చేశాడో తెలీదు గానీ, ఈరోజు టీజర్ విడుదల చేశాడు. ఈనెల 18న ట్రైలర్ రాబోతోంది. హాట్ బ్యూటీ మియా మాల్కోవాతో తీసిన సినిమా కాబట్టి, ఎంతో కొంత బజ్ ఉంటుంది. అయితే ఈసినిమాని వర్మ ఓటీటీ కోసం తీసినట్టు అనిపిస్తోంది. ఇది వరకు మియా మాల్కోవాతో `జీఎస్టీ` తీశాడు. అయితే అది థియేటర్లో విడుదల కాలేదు. ఆన్ లైన్ ద్వారా ప్రయోగాత్మకంగా విడుదల చేశాడు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. టీజర్ చూస్తే చాలు.. ఈసినిమాకి సెన్సార్ అవ్వడం కష్టమే అనిపిస్తోంది. అయినా.. విడుదల చేసే అవకాశాల్లేవు. లాక్ డౌన్ వల్ల థియేటర్లు తెరవలేని పరిస్థితి. తెరిచినా ఇలాంటి సినిమాల్ని కొనేవారెవరు? అసలే వర్మ తన క్రేజ్‌ని పోగొట్టుకున్నాడు. వర్మ హిట్టు కొడితే చూడాలని చాలామంది ఎదురు చూస్తున్నా – అలాంటి గొప్ప ప్రయత్నాలేం తన నుంచి రావడం లేదు. ప్రస్తుతం ఓటీటీకి మంచి మార్కెట్ ఉంది. దానికి తోడు… ఈ సినిమా బడ్జెట్ పరిమితులకు లోబడే తీసి ఉంటాడు. ఓటీటీకి అమ్ముకున్నా ఈ సినిమా గట్టెక్కేయడం ఖాయం. సో… క్లైమాక్స్‌ని ఓటీటీ లో చూసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మే 18న ట్రైలర్ చూస్తే… ఓటీటీలో అయినా ఈ సినిమా చూడగలమా? లేదా? అనే దానిపై ఓ అంచనాకు రావొచ్చు.